తెలుగు తెరపై అగ్రకథానాయికగా వెలిగిన త్రిష ప్రస్తుతం కోలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడే వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా కె.తిరుగననమ్ దర్శకత్వంలో 'పరమపదం విలయట్టు' చిత్రంలో నటిస్తోంది. ఇది త్రిష కెరీర్లో 60వ సినిమా. ఈ రోజు త్రిష 36వ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో త్రిష బధిర చిన్నారికి తల్లిగా నటించింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష మరోసారి తనలోని ప్రతిభను బయటపెట్టింది.
త్రిష బర్త్‌డే కానుకగా 60వ సినిమా ట్రైలర్ - రాంగి
దక్షిణాది అందాల నాయిక త్రిష కోలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. నేడు 36వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా... ఆమె కెరీర్లో 60వ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
త్రిష బర్త్‌డే కానుకగా 60వ సినిమా ట్రైలర్
24 అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. అమ్రీష్ సంగీతం అందించారు. మురుగదాస్ శిష్యుడు శరవణన్ దర్శకత్వంలో త్రిష మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది. ‘రాంగి’ అనే టైటిల్‌తో ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది.
ఇటీవల త్రిష నటించిన '96', 'పేట' చిత్రాలు మంచి విజయం సాధించాయి. త్రిష ప్రస్తుతం తన తల్లి ఉషా క్రిషన్‌తో కలిసి అమెరికాలో విహారంలో ఉంది.