తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మిమ్మల్ని నిరాశ పరుస్తున్నా.. క్షమించండి..! - డార్లింగ్ ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్​కు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఫిట్​నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్​.. ప్రభాస్​ను కొత్త లుక్​లో చూపించేందుకు సిద్ధమవుతున్నాడని ఈ కథనాల సారాంశం. అయితే దీనిపై స్పందించాడు లాయిడ్.

prabhas
ప్రభాస్

By

Published : Jan 6, 2020, 1:45 PM IST

"మిమ్మల్ని నిరాశ పరుస్తున్నా.. నన్ను క్షమించండి".. అంటూ ప్రభాస్‌కు సంబంధించిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. డార్లింగ్‌ అభిమానులంతా కూడా నిరాశలో మునిగిపోయారు. అయితే ఇదేం ప్రభాస్‌ చేసిన ట్వీట్‌ కాదులెండి. ఈ హీరో గురించి మాట్లాడుతూ ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ చేసిన ట్వీట్‌ ఇది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం లాయిడ్ 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం కోసం ఎన్టీఆర్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు గతంలోనూ 'అరవింద సమేత' కోసం తారక్‌కు శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం లాయిడ్.. ప్రభాస్‌ను 'జాన్‌' చిత్రం కోసం కొత్త లుక్‌లో చూపించేందుకు సిద్ధమవుతున్నాడని, ఇప్పటికే తన అధ్వర్యంలో డార్లింగ్‌తో జిమ్‌లో కఠిన కసరత్తులు చేయించడం షురూ చేశాడని మీడియాలో వార్తలొచ్చాయి.

తాజాగా ఈ విషయం లాయిడ్ దృష్టికి వెళ్లింది. అతడు దీనిపై ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు. "మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించాలి. కానీ, ఈ వార్త నిజం కాదు. ఇలాంటి పుకార్లు ఎలా వస్తాయో కూడా నాకు అర్థం కావట్లేదు" అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇవీ చూడండి.. బన్నీకి సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details