*కింగ్ నాగార్జున కోసం మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. నాగ్ నటించిన 'వైల్డ్‌డాగ్' ట్రైలర్‌ను శుక్రవారం(ఫిబ్రవరి 12) సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 2 థియేటర్లలోకి రానుందీ చిత్రం. ఇందులో నాగ్, ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మగా నటించారు.
నాగ్ కోసం చిరు.. మెగాహీరో కోసం పూరీ - puri jagannath ee kathalo paathralu kalpitam
కొత్త సినిమాల ట్రైలర్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వైల్డ్‌డాగ్, ఈ కథలో పాత్రలు కల్పితం ప్రచార చిత్రాలు శుక్రవారం విడుదల కానున్నాయి.
నాగ్ కోసం చిరు.. మెగాహీరో కోసం పూరీ
*మెగాహీరో పవన్‌తేజ్ పరిచయం చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం' ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రిలీజ్ చేయనున్నారు. సాయంత్రం 7:05 గంటలకు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మేఘన హీరోయిన్గా నటించింది. అభిరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.