తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చావు కబురు చల్లగా'- 'శ్రీకారం' ట్రైలర్లు వచ్చేశాయి! - ఆకాశవాణి టీజర్​

కొత్త సినిమా ట్రైలర్లు వచ్చేశాయి. 'చావు కబురు చల్లగా', 'శ్రీకారం' సినిమాల ట్రైలర్లతో పాటు 'ఆకాశవాణి' టీజర్​.. 'మహాసముద్రం' ఫస్ట్​లుక్​ కబుర్లు ఇందులో ఉన్నాయి.

Trailers of chavu kaburu challaga, Sreekaram movies
'చావు కబురు చల్లగా'- 'శ్రీకారం' ట్రైలర్లు వచ్చేశాయి!

By

Published : Mar 5, 2021, 7:40 PM IST

యువ కథానాయకుడు కార్తికేయ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. లావణ్య త్రిపాఠి నాయిక. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, మల్లిగా లావణ్య ఆకట్టుకుంటున్నారు. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. జాక్స్‌ బెజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శర్వానంద్ హీరోగా కిశోర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. యువ కథానాయకులు నితిన్‌, నాని, వరుణ్‌ తేజ్‌ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. రైతు పాత్రలో శర్వానంద్‌ ఆకట్టుకుంటున్నారు. ప్రియాంక అందం కనువిందు చేస్తోంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కానుంది.

అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందిన ఆకాశవాణి చిత్ర టీజర్​ను ప్రముఖ దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి శుక్రవారం విడుదల చేశారు.

దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళితో 'ఆకాశవాణి' చిత్రబృందం

శర్వానంద్​, సిద్ధార్థ్​ ప్రధానపాత్రల్లో.. అజయ్​ భూపతి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'మహాసముద్రం'. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను శనివారం (మార్చి 6) ఉదయం 9.09 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

'మహాసముద్రం' ఫస్ట్​లుక్​ అప్​డేట్

ఇదీ చూడండి:అలనాటి నటి బయోపిక్​లో తమన్నా!

ABOUT THE AUTHOR

...view details