ప్రజాప్రతినిధులు, న్యాయవ్యవస్థ, అధికార వ్యవస్థ ఇలా ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యనికి అర్థం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy On Republic Movie) అన్నారు. నేటి సమాజం స్థితిగతులతో పాటు భవిష్యత్ తరాలకు ప్రజాస్వామ్య విలువలను అందించే విధంగా రిపబ్లిక్ చిత్రాన్ని దర్శకుడు దేవాకట్టా (Republic Director Devakatta)తెలుగు ప్రజలకు అందించారన్నారు.
Revanth Reddy Republic Movie: రిపబ్లిక్ చిత్రాన్ని వీక్షించిన రేవంత్‌రెడ్డి, సీతక్క
సాయిధరమ్‌తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రాన్ని (Republic Cinema) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy), ఎమ్మెల్యే సీతక్క (Mla Seethakka) వీక్షించారు. ప్రజాస్వామ్య విలువలను అందించే విధంగా రిపబ్లిక్ చిత్రాన్ని దర్శకుడు (Republic Director Devakatta) నిర్మించారని వారు అన్నారు.
దేవాకట్టా దర్శకత్వం వహించిన రిపబ్లిక్ చిత్రాన్ని ఎమ్మెల్యే సీతక్క, దర్శకుడు దేవాకట్టాతో కలిసి రేవంత్‌రెడ్డి చిత్రాన్ని వీక్షించారు. ప్రస్థానం చిత్రం కంటే రిపబ్లిక్ చిత్రం అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా ఆర్థికపరంగా నిర్మాతలకు లాభమో నష్టమో కానీ... తెలుగు ప్రజలకు మాత్రం లాభం కలుగుతుందన్నారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలని సూచించారు. మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే కింది స్థాయి నుంచే మార్పు రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ చిత్రం చూస్తే గుండె బరువెక్కిందన్నారు.
ఇదీ చూడండి: