తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Kala Trailer: మనిషిలోని మృగం మేల్కొంటే? - ఆహాలో కాలా

మలయాళ నటుడు టొవినో థామస్ (Tovino Thomas), దివ్యా పిళ్లై ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కాలా' (kala). ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆహా వేదికగా జూన్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

kala trailer
కాలా ట్రైలర్

By

Published : May 31, 2021, 4:54 PM IST

మలయాళ నటుడు టొవినో థామస్ (Tovino Thomas), దివ్యా పిళ్లై ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కాలా' (kala). వీఎస్ రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఆహా (kala on Aha) వేదికగా జూన్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ (kala trailer)​ను పంచుకుంది చిత్రబృందం. రా, ఇంటెన్సివ్​గా ఉన్న ఈ ప్రచారం చిత్రం సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఓ భావోద్వేగ పోరాటమే 'కాలా' స్టోరీ లైన్. పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఫారెస్ట్ హౌజ్​లో ఒకరోజు జరిగే కథ ఇది.

ఇవీ చూడండి: Puri Musings: బతికితే డేంజరస్​గా బతకాలి

ABOUT THE AUTHOR

...view details