బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించిన 'తోర్బాజ్' మూవీ దర్శకుడు గిరీష్ మాలిక్ ఇంట విషాదం నెలకొంది. గిరీష్ మాలిక్ తనయుడు మన్నన్(17) ఆకస్మికంగా చనిపోయాడు. ముంబయిలో హోలీ రోజు ప్రమాదవశాత్తు ఐదు అంతస్తుల భవనంపై నుంచి కిందపడి మరణించాడు.
ఘటన జరిగిన వెంటనే సమీపంలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రికి మన్నన్ను తరలించారు. అయితే యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.