శ్రీదేవి కూతురు జాన్వీకపూర్, షాహిద్‌కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ 'ధడక్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ సినిమాతో వెండితెర ప్రేమికులుగా ఆకట్టుకున్నారు. కరణ్‌జోహర్ నిర్మించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది.
'ధడక్' జోడీ మరోసారి రాబోతోందా..? - Top Bollywood on-screen couples we will love to watch again and again!
జాన్వీ కపూర్, ఇషాన్ ఖత్తర్ 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందని సమాచారం.
తాజాగా ఈ జంటను మరోసారి తెరపై చూపించడానికి కరణ్‌జోహర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించనున్నాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జాన్వీ 'తఖ్త్', 'రూహీ అప్జా'. 'కార్గిల్ గర్ల్', 'దోస్తానా 2' చిత్రాల్లో నటిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించనున్న 'కాలీ పీలీ’లో అనన్యా పాండేతో కలిసి నటిస్తున్నాడు ఇషాన్.
ఇవీ చూడండి.. 'బుమ్రా ఎవరో నాకు తెలియదు'