కథానాయికలు ఎప్పటికప్పుడు తమ అందాలతో అభిమానులను ఆకర్షిస్తుంటారు. ఫిట్నెస్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తమ ఆదరణను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే.. కొందరు భామలు తెరపై, ఫొటో షూట్స్‌లో న్యూడ్‌గా కనిపించేందుకు అస్సలు మొహమాటపడట్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో తమ హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చెకించిన భామలెవరో ఓ సారి చూసేద్దాం..
1. ఇషా గుప్తా
బాలీవుడ్ హాట్ అందాల భామ ఇషా గుప్తా(Isha Gupta latest pics).. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. ఇటీవలే ఓ టాప్లేస్ ఫొటోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులను షాక్‌కు గురిచేసింది. 'జన్నత్ 2', 'రాజ్ 3డీ' సినిమాలతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ భామ.. తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సినిమాలో ఐటమ్ సాంగ్‌లో నటించింది ఇషా(Isha Gupta Latest Movie). ప్రస్తుతం 'దేసి మ్యాజిక్', 'హేరా పెరి' చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
2. రాధికా ఆప్టే
2005లో విడుదలైన 'వాహ్!! లైఫ్ హో తో హసీ' చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన రాధిక ఆప్టే(Radhika Apte Latest Pictures).. బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి విభిన్నమైన కథల్లో నటిస్తూ ఆమె మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే.. న్యూడ్‌గా కనిపించేందుకూ ఆమె వెనుకాడలేదు. 2016లో విడుదలైన 'పార్చ్డ్'(Parched Movie Cast) చిత్రంలో టాప్ లెస్‌గా కనిపించి అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది. అనంతరం ఆమె అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంది.
3. ఇందిరా వర్మ
'కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్' చిత్రంతో కెరీర్ ప్రారంభించింది బ్రిటీష్ నటి ఇందిరా వర్మ(Indira Varma movies and TV shows). ఈ చిత్రంలో అనేక బోల్డ్ సీన్స్ చేసింది. కొన్ని సన్నివేశాల్లో న్యూడ్గాను కనిపించింది. అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నందున ఈ చిత్రాన్ని భారత్‌లో బ్యాన్ చేశారు. అనంతరం చాలా సినిమాల్లో ఈమె టాప్‌లెస్‌గా కనిపించింది. ప్రముఖ హాలీవుడ్ టీవీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో కీలక పాత్ర పోషించింది ఇందిరా.
4. సన్నీ లియోని
హాట్ అందాలకు కేరాఫ్ అడ్రస్ సన్నీలియోని(Sunny Leone movie news). అందాల ఆరబోతతో కుర్రకారుకు మత్తెక్కించింది ఈ భామ. ఫోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి.. బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకునే వరకు ఎదిగింది. 'జిస్మ్ 2' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది సన్నీ. ఈ సినిమాలో న్యూడ్ సన్నివేశాలూ చేసింది. తర్వాత 'రాగిని ఎంఎంఎస్ 2', 'హేట్ స్టోరీ' వంటి పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ బాషల్లో ఐటమ్ సాంగ్స్‌లో నటించింది.