బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొవిడ్ టీకా తీసుకున్నారు. "టీకా తొలి డోసు వేయించుకున్నాను" అని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో ఈ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిసింది.
కొవిడ్ టీకా తీసుకున్న సల్మాన్ ఖాన్ - corona vaccine salman khan
కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు ట్వీట్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో ఈ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్
హిందీ చిత్రసీమలో ఇప్పటివరకు అనేక మంది ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకున్నారు. వారిలో సైఫ్ అలీఖాన్, పరేష్ రావల్, అనుపమ్ ఖేర్, హేమా మాలిని, షర్మిళా ఠాగూర్, నీనా గుప్తా, రాకేశ్ రోషన్, సంజయ్‌దత్ ఉన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ టీకా తీసుకున్న నటుడు సంజయ్ దత్