బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు(Sharukh Khan) ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ స్టార్హీరో అంటే ఓ హాలీవుడ్ ప్రముఖ నటుడుకు బాగా ఇష్టమట!
టామ్ హిడిల్స్టన్(Tom Hiddleston).. ఈ పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. అవెంజర్స్ సిరీస్‌లో 'లోకి'(సూపర్‌విలన్) పాత్ర చెబితే టక్కున గుర్తొస్తుంది. తాజాగా ఇతడు 'వర్డ్ అసోసియేషన్'(ఒక పదం చెప్పగానే మనకు మొదట గుర్తొచ్చేది ఏంటి) గేమ్ ఆడాడు. ఇందులో భాగంగా 'ఇండియా- షారుక్ ఖాన్', 'బాలీవుడ్-షారుక్‌ఖాన్' అని జవాబు చెప్పాడు. దీని ద్వారా బాద్షా అంటే అతడికి ఎంత ఇష్టమో తెలుస్తోంది. తమిళనాడులోని చెన్నై అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అక్కడ తన అక్క నివసిస్తుందని, ఆ నగరానికి పలుసార్లు వచ్చినట్లు తెలిపాడు.