హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ లగ్జరీ కారు 'బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7' చోరీకి గురైంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'మిషన్: ఇమ్పాజిబుల్ 7' షూటింగ్ సమయంలో ఆయన వాహనాన్ని ఓ బడా హోటల్ ముందు పార్కింగ్ చేయగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సినీఫక్కీ తరహాలో దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో ఉన్న వేల పౌండ్లు విలువైన లగేజ్ బ్యాగ్‌ను తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన క్రూజ్‌కు విపరీతమైన కోపం వచ్చిందట. ఈ సంఘటనను అక్కడి ఓ వార్తా సంస్థ తెలిపింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దొంగలను పట్టుకున్నారు. కారులో ఉన్న ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ డివైస్ ద్వారా వాహనాన్నికనుగొన్నారు. కానీ అందులో ఉన్న లగేజ్ బ్యాగ్‌ను ఇంకా స్వాధీనం చేసుకోలేదు.