Mission: Impossible 8: టామ్ క్రూజ్ నటించిన 'మిషన్: ఇంపాజిబుల్' చిత్రాలకు సినీ ప్రియుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ప్రాంచైజీ నుంచి 'మిషన్: ఇంపాజిబుల్ 7', 'మిషన్: ఇంపాజిబుల్ 8' చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలను క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కిస్తున్నారు. పారామౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హీరో క్రూజ్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యమయ్యాడు.
'మిషన్ ఇంపాజిబుల్ 7' రిలీజ్‌పై వివాదం.. చివరి చిత్రం అదేనా?
Mission: Impossible 8: 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ త్వరలోనే ముగియనుందని ప్రచారం సాగుతోంది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎనిమిదో భాగమే చివరిదని అంతా అంటున్నారు. ఇక ఏడో భాగం రిలీజ్‌పై హీరో క్రూజ్, నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది.
!['మిషన్ ఇంపాజిబుల్ 7' రిలీజ్‌పై వివాదం.. చివరి చిత్రం అదేనా? Mission: Impossible 8](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14843942-301-14843942-1648295618998.jpg)
అయితే 'మిషన్ ఇంపాజిబుల్ 7' రిలీజ్ విషయంలో టామ్ క్రూజ్, నిర్మణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ మధ్య విభేదాలు వచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రం రిలీజ్ అయిన 45 రోజులు తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాణ సంస్థ భావిస్తోందట. కానీ క్రూజ్ ఈ నిర్ణయాన్ని తిరస్కరించాడని సమాచారం. సాధారణంగా క్రూజ్ నటించిన సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన మూడు నెలల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. కానీ ఈ చిత్రం 45 రోజుల్లోనే విడుదల అవుతుందని తెలిస్తే.. థియేటర్ల కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుందని క్రూజ్ ఆందోళన వ్యక్తం చేశాడట. ఇక ఈ విభేదాల కారణంగా 'మిషన్ ఇంపాజిబుల్ 8' బడ్జెట్‌పై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని క్రూజ్, దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ భావిస్తున్నారట! ప్రస్తుతం ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు వీరిద్దరు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎనిమిదో భాగంతో 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ ముగుస్తుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇదీ చూడండి: బాక్సాఫీస్ బద్దల్.. 'బాహుబలి' రికార్డ్ బ్రేక్ చేసిన 'ఆర్ఆర్ఆర్'