ప్రపంచవ్యాప్తంగా దేశం, భాష, వయసు బేధాలనేవి లేకుండా ప్రతి ఇంట్లోనూ నవ్వులు పూయించే కార్టూన్ పాత్రలు 'టామ్ అండ్ జెర్రీ'. వీటి ఆధారంగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను తొలుత 2021 ఏప్రిల్ 16న విడుదలకు చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల నాలుగు నెలల ముందుగానే తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'టామ్ అండ్ జెర్రీ' వచ్చేది ఎప్పుడంటే..! - టామ్ అండ్ జెర్రీ సినిమా విడుదల
హాలీవుడ్లో తెరకెక్కుతోన్న 'టామ్ అండ్ జెర్రీ' లైవ్ యాక్షన్ సినిమా విడుదల తేదీ మారింది. వచ్చే ఏడాది డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'టామ్ అండ్ జెర్రీ' వచ్చేది ఎప్పుడంటే..
ఈ సినిమాలో క్లో గ్రేస్ మోరెట్, మైఖేల్ పెనా, కెన్ జియోంగ్, భారతీయ నటి పల్లవి శ్రద్ధా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టిమ్ స్టోరీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదీ చూడండి : పోలీస్‌గా బాలకృష్ణ.. 'రూలర్' అంటూ గర్జన