తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​లతో జోరు చూపిస్తోన్న కుర్ర హీరోలు - అంధాధున్​ రీమేక్

లాక్​డౌన్​ తర్వాత టాలీవుడ్​ యువకథానాయకులు సినిమాల జోరు కొనసాగిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న వీరు.. ఇటీవలే షూటింగ్​కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల చేతిలో ఉన్న సినిమాలతో పాటు కొత్త చిత్రాలను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవ్వబోయే సినిమాలేవో తెలుసుకుందామా.

Tollywood young heroes continuing the boom of new movies after lockdown
జస్ట్​ టైమ్​ గ్యాప్​.. షూటింగ్​లకు నో గ్యాప్​​

By

Published : Sep 25, 2020, 7:29 AM IST

యువ కథానాయకుల వేగం సినీ పరిశ్రమకెప్పుడూ నూతనోత్తేజాన్ని అందిస్తుంటుంది. అగ్ర హీరోలు టెస్ట్‌ క్రికెటర్ల తరహాలో నెమ్మదిగా ఏడాదికొక చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరిస్తే.. కుర్ర హీరోలు టీ20 స్టైల్‌లో నాలుగైదు సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేస్తుంటారు. కానీ, కరోనా పరిస్థితుల వల్ల అందరి ప్రణాళికలూ తారుమారయ్యాయి. ఇప్పుడు చిత్రీకరణల సందడి తిరిగి మొదలవడం వల్ల మునుపటి ఫామ్‌తో దూసుకెళ్తున్నారు కుర్ర హీరోలు. ఇప్పటికే తుది దశ చిత్రీకరణలో ఉన్న చిత్రాలకు గుమ్మడికాయ కొట్టేసి.. కొత్త ప్రయాణాలకు శ్రీకారం చుట్టేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.

ఐఏఎస్​ అధికారిగా తేజ్​

కరోనా దెబ్బకు కుదేలైన సినీ పరిశ్రమ నెమ్మదిగా కుదురుకుంటోంది. అగ్ర కథానాయకులు సెట్లో అడుగుపెట్టేందుకు మరి కాస్త సమయం పట్టేలా కనిపిస్తున్నా.. కుర్ర హీరోలు చకచకా సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడీ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు కథానాయకుడు సాయితేజ్‌. ఇటీవలే 'సోలో బ్రతుకే సో బెటరు' చిత్రానికి గుమ్మడికాయ కొట్టిన ఆయన.. ఇప్పుడు దేవ కట్టా దర్శకత్వంలో కొత్త సినిమాని పట్టాలెక్కించనున్నారు. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ చిత్రం.. అక్టోబరు రెండో వారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోబోతుంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తేజ్‌ ఓ ఐఏఎస్‌ అధికారికగా కనిపించనున్నట్లు సమాచారం.

నాగ చైతన్య, సాయి తేజ్​

'థ్యాంక్యూ'తో చైతూ

ఇదే నెలలో తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం ఆయన శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న 'లవ్‌స్టోరీ' తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే 'థ్యాంక్యూ' చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు చైతూ. అక్టోబరు ఆఖరి వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమిది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

'అంధాధూన్'​ రీమేక్​లో..

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న 'రంగ్‌ దే' తుది దశ చిత్రీకరణలోనే ఉంది. బుధవారమే పునఃప్రారంభమైన ఈ చిత్రం.. వచ్చే నెలతో పూర్తవుతుంది. దీని తర్వాత ఆయన 'అంధాధూన్‌' రీమేక్‌తో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబరు నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆయన అంధుడిగా కనిపించబోతున్నారు. తమన్నా, నభా నటేష్‌ ప్రధాన పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.

నితిన్​, అఖిల్​, సుధీర్​ బాబు

'సైరా' దర్శకుడితో అక్కినేని వారసుడు

'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌' చిత్రంతో బిజీగా గడుపుతోన్న అక్కినేని అఖిల్‌ సైతం కొత్త కబురు వినిపించేశారు. ఆయన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని డిసెంబరు నుంచే పట్టాలెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఈ లాక్‌డౌన్‌లో 'వి' చిత్రంతో సందడి చేసిన సుధీర్‌బాబు.. ఇప్పుడు మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నారు. 'పలాస' ఫేం కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమిది. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

ABOUT THE AUTHOR

...view details