తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మలయాళ సినిమా మరోసారి సత్తా చాటింది'

ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ పురస్కారానికి మలయాళ సినిమా 'జల్లికట్టు' అర్హత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు టాలీవుడ్​ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేశ్​. ఆ సినిమా యూనిట్​కు అభినందనలు తెలిపారు.

tollywood top hero venkatesh praised jallikattu movie team
మలయాళ సినిమా సత్తా చాటింది: వెంకటేశ్‌

By

Published : Nov 26, 2020, 9:08 PM IST

ఆస్కార్‌ పురస్కారానికి అర్హత సాధించడం వల్ల మలయాళ సినీ పరిశ్రమ తన సత్తా చాటిందని టాలీవుడ్‌ అగ్రహీరో విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. మలయాళీ చిత్రం జల్లికట్టు 'ఆస్కార్‌'కు అర్హత సాధించిన సందర్భంగా వెంకటేశ్‌.. ట్విట్టర్​ వేదికగా స్పందించారు. ఆ చిత్ర బృందం మొత్తానికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. 'జల్లికట్టు'కు లిజో జోసి పెల్లిస్సెరీ దర్శకత్వం వహించారు.

'ఆస్కార్‌' కోసం పోటీపడ్డ శకుంతలా దేవీ, గుంజన్‌ సక్సేనా, ఛపాక్‌, గులాబో సితాబో, చెక్‌పోస్ట్‌, స్కై ఈజ్‌ పింక్‌ ఇలా మొత్తం 27 ఉత్తమ చిత్రాలను పరిశీలించిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా.. 'జల్లికట్టు'ను ఎంపిక చేసింది. ఈసారి ఆస్కార్‌ రేసులో ఈ సినిమా నిలిచినట్లు ప్రకటించింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల మల్టీస్టారర్‌ చిత్రాలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నారు వెంకీమామ. ప్రస్తుతం నారప్ప చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్‌తేజ్‌తో కలిసి 'ఎఫ్‌3'లో నటించనున్నారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన 'ఎఫ్‌2' ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇటీవల ప్రకటించిన ఇండియన్‌ పనోరమ అవార్డు సొంతం చేసుకున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. దానికి సీక్వెల్‌గా 'ఎఫ్‌3'ని తెరకెక్కించాలని దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో పాటు వెంకటేశ్‌, రానా కాంబినేషన్‌లో మరో మరోసినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథను ఫైనల్‌ చేశామని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని స్వయంగా రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇదీ చూడండి:భారత్​ నుంచి ఆస్కార్​ రేసులో 'జల్లికట్టు'

ABOUT THE AUTHOR

...view details