కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అన్‌లాక్ తర్వాత చిత్రీకరణలకు ప్రభుత్వాలు అనుమతులిచ్చినప్పటికీ.. వైరస్ భయంతో స్టార్ హీరోలెవరూ షూటింగ్‌లను ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు షూటింగ్‌కు హాజరయ్యారు. అయితే అది సినిమా షూటింగ్ కాదు.. వాణిజ్య ప్రకటన చిత్రీకరణ.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ రెండ్రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారట. తాజాగా ప్రిన్స్ లుక్‌ను అవినాష్ గోవార్కర్ అనే సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ షేర్ చేయగా.. దానికి రీట్వీట్ చేస్తూ మహేశ్ సమాధానం ఇచ్చారు. ప్యాకప్ షాట్స్ సమయంలో అవినాష్ తీసే ఫొటోలను మిస్ అయినట్లు సూపర్‌స్టార్ తెలిపారు. మళ్లీ షూటింగ్లో పాల్గొనడంపైనా హర్షం వ్యక్తం చేశారు.