తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ రోజు భలే తమాషాగా గడిచింది!

‘పుష్ప’గా కొత్తావతారమెత్తాడు స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌. ‘గమ్మునుండవోయ్‌’ అంటూ ఇప్పటికే తెలంగాణ యాసలో మెప్పించిన బన్నీ ఈసారి ‘పుష్ప’ చిత్రంలో చిత్తూరు యాస పలకనున్నాడు. గుబురు గడ్డంతో ఆ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న అల్లు అర్జున్‌ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలివిగో...

tollywood stylish star allu arjun shares some interesting facts of his life
tollywood stylish star allu arjun shares some interesting facts of his life

By

Published : Jun 7, 2020, 5:47 PM IST

తొలి సంపాదన...

సినిమాల్లోకి రాకముందు యానిమేషన్‌ మీదున్న ఇష్టంతో ఆ కోర్సు నేర్చుకుని ఓ సంస్థలో కొన్నాళ్లు అప్రెంటీస్‌గా పనిచేశా. అక్కడ నేను అందుకున్న జీతం రూ.3500. అదే నా తొలిసంపాదన.

ఎవరి డాన్స్‌ ఇష్టం...

హిందీ నటుడు గొవిందా డాన్స్‌ ఇష్టం. ఆయన స్టెప్పులు వేస్తుంటే చూపుతిప్పుకోలేనంటే నమ్మండి.

స్ఫూర్తినిచ్చే వ్యక్తి...

స్ఫూర్తినిచ్చే వ్యక్తి

అమితాబ్‌ బచ్చన్‌... 80కి దగ్గరవుతున్నా కుర్రాడిలా దూసుకుపోతున్నారు. నేను కూడా ఆయనలా ఆ వయసులోనూ సినిమాల్లో నటించాలనుకుంటున్నా.

ప్రభావం...

నాపైన మైఖెల్‌ జాక్సన్‌ ప్రభావం ఎక్కువ. చిన్నప్పుడు ఆయన మ్యూజిక్‌ వీడియోలు ఎక్కువగా చూసేవాణ్ణి. వాటి ప్రభావం నా దుస్తుల విషయంలో స్పష్టంగా కనిపించేది. అందుకేనేమో ఇప్పటికీ ఇంట్లో ఉన్నా స్టైల్‌గానే తయారవుతుంటా.

ఇష్టమైన సినిమాలు...

నచ్చిన సినిమా

టైటానిక్‌... తెలుగులో అయితే ఇంద్ర. అలానే గతేడాది వచ్చిన గల్లీబాయ్‌ కూడా బాగా నచ్చింది.

పుస్తకాలు...

నాకు పుస్తకాలు చదవడం ఇష్టమే. ఫలానా పుస్తకం అని చెప్పనుగానీ వ్యక్తిత్వ వికాసం, అవినీతి, పెళ్లి వంటి అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కుగా చదువుతా.

ఇష్టమైన కారు

ఫేవరెట్ కార్

ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ప్రస్తుతం ఎస్‌యూవీ రేంజ్‌రోవర్‌ వోగ్‌. రెండున్నర కోట్లు పెట్టి ఈ మధ్యనే కొన్నా.

సంతృప్తినిచ్చింది...

సంతృప్తినిచ్చిన సినిమా

చరిత్రను గుర్తు చేసిన ‘రుద్రమదేవి’ సినిమాకి పారితోషికం తీసుకోకుండా నటించడం.

సెట్‌లో తొలిరోజు...

గంగోత్రి నా తొలిసినిమా. మొదటిరోజు డైరెక్టర్‌ యాక్షన్‌ చెప్పక ముందే నేను డాన్స్‌ చేసేవాణ్ణి. అలానే రాఘవేంద్రరావు అంకుల్‌ నా చేతికి ఆపిల్‌ పళ్లు ఇచ్చి ఎక్కడ కొట్టమంటే అక్కడ కొట్టేవాణ్ణి. ఆరోజు భలే తమాషాగా గడిచింది.

సోషల్‌ మీడియాలో...

ఫేస్‌బుక్‌లో కోటి మంది అభిమానుల్ని సంపాదించుకున్న తొలి దక్షిణాది హీరోని నేనే అని చెప్పుకోవడానికి గర్వపడతా. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ కంటే ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్కువగా వాడుతున్నా.

బాధపడింది...

ఐశ్వర్యారాయ్ పెళ్లైనప్పుడు చాలా బాధ పడ్డాను

నా పెళ్లైనప్పుడు చాలామంది అమ్మాయిలు బాధపడుతూ ఎస్సెమ్మెస్‌లూ, ఈ మెయిళ్లూ పంపించారు. అభిమాన తారలకు పెళ్లైతే ఉండే బాధ నాకూ తెలుసు. ఐశ్వర్యారాయ్‌ పెళ్లైనప్పుడు నేనూ ఎంత బాధపడ్డానో...!

నచ్చే స్టైల్‌...

సోనమ్‌ కపూర్‌ స్టైల్‌ ఇష్టం. మన దగ్గర విజయ్‌ దేవరకొండ డ్రెస్సింగ్‌ నచ్చుతుంది.

హాలిడే స్పాట్‌

ఫేవరెట్ హాలిడే స్పాట్

ప్యారిస్‌... ఏటా ఒక్కసారైనా వెళ్లి వస్తుంటా. మా అయాన్‌కి కూడా చాలా ఇష్టం.

ABOUT THE AUTHOR

...view details