తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో 'పుష్ప'! - పుష్ప చిత్రీకరణ

సుకుమార్​-అల్లు అర్జున్​ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. స్వల్ప విరామం అనంతరం హైదరాబాద్​లో ఈ సినిమా షూటింగ్​ మళ్లీ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్​లో యాక్షన్​ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం.

tollywood stylish star allu arjun participated in pushpa shooting again with action episode
'పుష్ప' షూటింగ్​ మళ్లీ యాక్షన్​ సన్నివేశాలతోనే!

By

Published : Dec 17, 2020, 2:19 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. లాక్​డౌన్​ వల్ల అనేక ఇబ్బందుల్ని దాటుకుని ఈ సినిమా షూటింగ్​ పునఃప్రారంభమైంది. మొట్ట మొదటిగా భారీ యాక్షన్ సీక్వెన్స్​తో చిత్రీకరణ​ మొదలు పెట్టారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ షూట్​లో పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా మారేడుమిల్లి అడవుల్లో భావోద్వేగ పూరిత పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు.

అయితే.. ఇప్పుడు స్వల్ప విరామం అనంతరం కూడా యాక్షన్ పార్ట్​తోనే ఈ సినిమా షూటింగ్​ ప్రాంరభమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్​లో వేసిన సెట్లో విలన్ గ్యాంగ్​తో కలిసి ఉండే ఒక సీన్​లో అల్లు అర్జున్​ పాల్గొన్నట్లు సమాచారం.

ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. అల్లు అర్జున్‌ మాస్‌ పాత్రలో, పుష్పరాజ్‌ అనే యువకుడిగా కనిపించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక నటించనున్నారు. ఈ సినిమా కోసం చిత్తూరు యాసలో వీరిద్దరూ తర్ఫీదు పొందారు. దేవీ శ్రీ ప్రసాద్​ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్​ సంస్థ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి:అల్లు అర్జున్‌కి తొమ్మిది మంది విలన్లా..?

ABOUT THE AUTHOR

...view details