తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం - మెగాస్టార్ చిరంజీవి వార్తలు

వరదలతో అతలాకుతలమవుతున్న భాగ్యనగరి వాసులను ఆదుకునేందుకు పలువురు విరాళాలు ప్రకటిస్తూ... ఉదారతను చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సినీ ప్రముఖులు సైతం సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.

tollywood-stars-donate-to-cm-relief-fund-on-floods-in-telangana
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువలు... బాసటగా నిలిచిన సినీ ప్రముఖులు

By

Published : Oct 20, 2020, 3:43 PM IST

ప్రకృతి బీభత్సానికి అల్లాడుతున్న వారికి బాసటగా నిలిచిన మెగాస్టార్‌ చిరంజీవి... కోటి రూపాయల విరాళం ప్రకటించారు. విపత్తు వేళ బాధితులకు అండగా ఉండాల్సిన అవసరముందన్న మహేశ్‌బాబు... తనవంతుగా కోటి విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.

వరద సహాయక చర్యల కోసం నటుడు జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. సీఎం సహాయ నిధికి 50 లక్షలు ప్రకటించిన నటుడు నాగార్జున... ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందించారు.

వీరితో పాటు భాగ్యనగరికి బాసటగా విజయ్‌ దేవరకొండ రూ.10లక్షలు, సినీదర్శకులు హరీశ్‌శంకర్, అనిల్‌రావిపూడి రూ.5లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. హారిక, హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థతో కలిసి త్రివిక్రమ్ రూ.10లక్షలు ప్రకటించారు. సీఎస్సార్ డెవలపర్స్‌ ఎండీ చెరుకు సుధాకర్‌రెడ్డి 10లక్షల చెక్కును మంత్రి కేటీఆర్​కు అందజేశారు. తెలుగు నటీనటులందరూ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హార్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:హైదరాబాద్‌ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details