తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వకీల్​ సాబ్' కోసం మళ్లీ రంగంలోకి పవన్.. - దిల్‌రాజు

'వకీల్​ సాబ్' సినిమా కోసం మళ్లీ సెట్లోకి అడుగు పెట్టారు పవర్​ స్టార్​ పవన్​ కళ్యాణ్​. ఈ సినిమాలోని ఓ కీలక ఎపిసోడ్​లో ఆయన భాగం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​.. హైదరాబాద్​లో శరవేగంగా జరుగుతోంది. ​

tollywood star pawan kalyan paticipated in vakeel saab shooting in hyderabad
'వకీల్​ సాబ్' కోసం మళ్లీ రంగంలోకి దిగిన పవన్​​

By

Published : Dec 17, 2020, 8:21 AM IST

అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ 'వకీల్‌సాబ్‌' కోసం మళ్లీ సెట్లోకి అడుగుపెట్టారు. లాక్‌డౌన్‌ ముగియగానే ఈ చిత్రం కోసం రంగంలోకి దిగిన ఆయన, ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసి కాస్త విరామం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మరో కీలక ఎపిసోడ్‌కు సిద్ధమయ్యారు. ఈ షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా యాక్షన్‌ సీక్వెన్స్‌, ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

పవన్‌తో పాటు శ్రుతిహాసన్‌ కూడా షూటింగ్​లో పాల్గొంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే తుది దశ చిత్రీకరణకు చేరుకున్న ఈ సినిమా.. ఈ తాజా షెడ్యూల్‌తో పూర్తి కానుందని సమాచారం. హిందీ హిట్‌ చిత్రం 'పింక్‌'కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా థామస్‌, అంజలి కథానాయికలు. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

ఇదీ చూడండి:'వకీల్ సాబ్'.. వచ్చేది అప్పుడేనా?

ABOUT THE AUTHOR

...view details