తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చాలా రోజుల తర్వాత మహేశ్​ మళ్లీ అలా! - మహేశ్​బాబు డ్యూయల్​రోల్​

హీరో అయిన తర్వాత మహేశ్.. ఇప్పటివరకు​ ద్విపాత్రాభినయం చేయలేదు. ఓ సినిమాలో చేసినా, కొద్దిసేపే కనిపించాడు. ఇప్పుడు తన కొత్త చిత్రం కోసం పూర్తిస్థాయిలో డ్యూయల్ రోల్​లో దర్శనమివ్వనున్నాడట మహేశ్.

Tollywood star Mahesh Babu will be seen playing dual role in his next film with director Vamshi Paidipally
చాలా రోజుల తర్వాత మహేశ్​ మళ్లీ అలా!

By

Published : Feb 6, 2020, 4:50 PM IST

Updated : Feb 29, 2020, 10:17 AM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. త్వరలో కొత్త సినిమా షూటింగ్​ మొదలు పెట్టనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త.. ప్రస్తుతం హల్​చల్ చేస్తోంది. ఇందులో మహేశ్​.. స్పై అధికారిగా కనిపించనున్నాడని, చాలా రోజుల తర్వాత ఈ చిత్రం కోసం పూర్తిస్థాయిలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సూపర్​స్టార్ రజనీకాంత్ 'భాషా' తరహాలో ఈ సినిమా కథను సిద్ధం చేశాడట దర్శకుడు వంశీ పైడిపల్లి. ఒకవేళ ఇదే నిజమైతే బాగుండు అని అభిమానులు అప్పుడే సంబరపడిపోతున్నారు.

చాలా రోజుల తర్వాత మహేశ్​ మళ్లీ అలా!

తండ్రి, సూపర్​స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో మహేశ్​ తొలిసారి డ్యూయల్ రోల్ చేశాడు. ఆ తర్వాత 'నాని' చిత్రంలోని చివరి సన్నివేశంలో కొద్దిసేపు తండ్రి, కొడుకులుగా కనిపించి ప్రేక్షకులను అలరించాడు.

ఇదీ చదవండి:విజయ్​ 'బిగిల్' టీమ్​పై ఐటీ గురి- 65కోట్లు సీజ్​

Last Updated : Feb 29, 2020, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details