తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ హీరోయిన్లతో ఆ దర్శకుల కాంబినేషన్ అదుర్స్!

కొందరు హీరోయిన్లతో తమది హిట్​ కాంబినేషన్​ అని నిరూపించుకుంటున్నారు టాలీవుడ్ దర్శకులు. ఇంతకీ ఆ కథానాయికలు ఎవరు?  వారి కథేంటి? తదితర విషయాల సమాహారమే ఈ కథనం.

తమన్నా-సాయి పల్లవి-పూజా హెగ్డే-రష్మిక

By

Published : Nov 24, 2019, 1:48 PM IST

హీరో హీరోయిన్​లకు కెమిస్ట్రీ ఎంత అవసరమో.. హీరోయిన్​తో దర్శకులకు అంతే పరస్పర అవగాహన ఉండాలి. లేదంటే సినిమా ఫ్లాప్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తాము తెరకెక్కించబోయే చిత్రాల్లో కొత్త వారికి బదులుగా, అంతకు ముందు తమతో పనిచేసిన వారినే నటింపజేస్తున్నారు. ఈ జాబితాలో త్రివిక్రమ్, హరీశ్​ శంకర్​, సురేందర్​రెడ్డి వంటి టాప్ డైరక్టర్​లు ఉన్నారు. వారి గురించే ఈ ప్రత్యేక కథనం.

త్రివిక్రమ్-పూజా హెగ్డే

గత కొద్ది కాలంలో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలు చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడీ దర్శకుడు. ఇందులో నటిస్తున్న హీరోయిన్​ పూజాహెగ్డే.. 'అరవింద సమేత' కోసం ఇదే డైరక్టర్​తో కలిసి పనిచేసింది. ఇంతకు ముందు హీరోయిన్​ సమంత.. త్రివిక్రమ్​ రూపొందించిన మూడు చిత్రాల్లో(అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ) హీరోయిన్​గా కనిపించింది.

త్రివిక్రమ్-పూజా హెగ్డే

హరీశ్​ శంకర్-పూజా హెగ్డే

ఇటీవలే 'గద్దలకొండ గణేష్​'తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఇందులో హీరోయిన్​గా నటించింది పూజా హెగ్డే. ఈ డైరక్టర్​ తెరకెక్కించిన గత చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్' ఈమెనే కథానాయిక. ఇంతకు ముందు 'గబ్బర్​సింగ్', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాల్లో శ్రుతిహాసన్​ హీరోయిన్​గా కనిపించింది.

హరీశ్ శంకర్-పూజా హెగ్డే

సురేందర్ రెడ్డి-తమన్నా

మెగాస్టార్ చిరంజీవితో 'సైరా' తీసే అవకాశం దక్కించుకున్నాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ హీరోయిన్​గా నటించిన తమన్నా.. అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఇంతకు ముందు ఇదే దర్శకుడితో 'ఊసరవెల్లి' చిత్రం కోసం కలిసి పనిచేసింది. ఈ డైరక్టర్​తో రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా రెండు సినిమాలు(కిక్ 2, ధృవ) చేసింది.

తమన్నా-సురేందర్​రెడ్డి

శేఖర్​ కమ్ముల-సాయిపల్లవి

చాలా ఏళ్ల తర్వాత 'ఫిదా'(2017)తో హిట్​ కొట్టాడు దర్శకుడు శేఖర్​ కమ్ముల. కాస్త విరామం తీసుకుని హీరో నాగచైతన్యతో సినిమా రూపొందిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్​ సాయిపల్లవినే. హీరోయిన్​ కమలినీ ముఖర్జీ ఈ డైరక్టర్​తో వరుసగా మూడు సినిమా(ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్)ల్లో నటించింది.

సాయిపల్లవి-శేఖర్ కమ్ముల

సంపత్ నంది-తమన్నా

ఈ దర్శకుడు ప్రస్తుతం హీరో గోపీచంద్​తో సినిమా తీస్తున్నాడు. ఇందులో హీరోయిన్​గా తమన్నా నటిస్తోంది. ఈ డైరక్టర్​తో ఈమె పనిచేయడం ఇది మూడోసారి. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్​లో 'రచ్చ', 'బెంగాల్ టైగర్'​ అనే సినిమాలు వచ్చాయి.

తమన్నా- సంపత్ నంది

వెంకీ కుడుముల-రష్మిక

తొలి సినిమా 'ఛలో'తోనే గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకీ కుడుముల. అందులో హీరోయిన్​ నటించిన రష్మికనే.. తన రెండో సినిమా కోసం ఎంపిక చేసుకున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

రష్మిక మందణ్న-వెంకీ కుడుముల

ABOUT THE AUTHOR

...view details