తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇమేజ్ పెరిగింది.. ట్యాగ్​ మారింది! - alluarjun stylish star to icon star

సినీపరిశ్రమలో స్టార్​డమ్​ ఆధారంగా ఒక్కో హీరోకు ఓక్కో బిరుదు(టైటిల్​) ఉంటుంది. అయితే ఈ ట్యాగ్​లైన్స్​ కథానాయకుల ఇమేజ్​ పెరిగే కొద్దీ మారిపోతుంటాయి. ఇటీవల స్టైలిష్​స్టార్​ అల్లు అర్జున్​.. ఐకాన్ ​స్టార్​గా మారారు. ఈ క్రమంలో ఇప్పటివరకు టైటిల్స్​ మార్చుకున్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం.

Tollywood star heroes
టాలీవుడ్​ స్టార్​ హీరోలు

By

Published : Jun 15, 2021, 9:16 AM IST

స్టార్​ హీరోల పేర్లకు ముందు టైటిల్స్​ ఉండటం సాధారణమే​. వారి ఇమేజ్​ ఆధారంగా అవి వారికి లభిస్తుంటాయి. అభిమానులు కూడా వారిని అవే పేర్లతో ప్రేమగా పిలుస్తుంటారు. అయితే కొంతమంది నటులకు కెరీర్​ ఆరంభంలో ఉన్న ట్యాగ్​లైన్​.. స్టార్​ ఇమేజ్​ పెరిగే కొద్దీ మారిపోతుంటుంది. ఇటీవల 'పుష్ప' సినిమా టీజర్​ రిలీజ్​కు హీరో అల్లు అర్జున్(Allu Arjun)​ స్టైలిష్​స్టార్ నుంచి​ ఐకాన్ ​స్టార్​గా మారారు. ఈయనే కాదు ఇప్పటికే కృష్ణ, చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్​ వంటి పలు హీరోలు కూడా తమ బిరుదులను మార్చుకున్నారు. దానికి సంబంధించిన వివరాల సమాహారమే ఈ కథనం..

కృష్ణ(Krishna)

కెరీర్​ ప్రారంభంలో 'నటశేఖర' బిరుదును సంపాదించుకున్నారు కృష్ణ. అనంతరం మాస్​ ఫాలోయింగ్​ పెరిగి 'సూపర్​స్టార్'​గా టైటిల్​ మారిపోయింది. 'సింహాసనం' సినిమా నుంచి ఇదే పేరుతో ఆయన కొనసాగుతున్నారు.

కృష్ణ

చిరంజీవి(Chiranjeevi)

చిరంజీవి.. తనదైన నటనతో మాస్​ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కెరీర్​ ఆరంభంలో 'డైనమిక్​ హీరో', 'సుప్రీమ్​ హీరో'గా వెలుగొందిన ఆయన్ను 'మరణ మృదంగం' సినిమా తర్వాత ఫ్యాన్స్​ ముద్దుగా 'మెగాస్టార్'​ అని పిలవడం ప్రారంభించారు. ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు.

చిరంజీవి

బాలకృష్ణ(Balakrishna)

మొదట 'యువరత్న'గా బిరుదు లభించింది. ఆ తర్వాత 'నట సింహం'గా మారిపోయింది. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్నారు.

బాలకృష్ణ

నాగార్జున(Nagarjuna)

హీరో నాగార్జునను కెరీర్​ ఆరంభదశలో 'యువసామ్రాట్​' అని పిలిచేవారు. అనంతరం ఆయన 'కింగ్​'గా మార్చుకున్నారు. ఇటీవల నాగ్​.. 'వైల్డ్​డాగ్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నాగార్జున

మహేశ్​బాబు(MaheshBabu)

సూపర్​స్టార్​ కృష్ణ వారసుడిగా చిన్నవయసులోనే మహేశ్​బాబు చిత్రసీమకు పరిచయమయ్యారు. అనంతరం తనదైన నటనతో 'ప్రిన్స్'​గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. స్టార్​డమ్​ పెరుగుతోన్న నేపథ్యంలో 'పోకిరి' సినిమా తర్వాత సూపర్​స్టార్ అయ్యారు.​

మహేశ్​బాబు

ఎన్టీఆర్​(NTR)

ఎన్టీఆర్​కు మొదట 'యంగ్​టైగర్'​ బిరుదు ఉండేది. 'శక్తి' సినిమాతో 'ఏ1స్టార్'​ టైటిల్​ యాడ్​ అయింది. కానీ ఇప్పటికీ 'యంగ్​ టైగర్'​ అనే అభిమానులు పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివతో ఓ చిత్రం చేయనున్నారు.

ఎన్టీఆర్​

ప్రభాస్​(యంగ్​ రెబల్​స్టార్​-రెబల్​స్టార్​), రవితేజ(మాస్​ హీరో-మాస్​ మహారాజ్​), నరేశ్​(అల్లరి నరేశ్​, శుభప్రదం నరేశ్​, నాంది నరేశ్​) ఇలా వారి టైటిల్స్​ ఇమేజ్​ పెరిగేకొద్దీ మారిపోయాయి.

అల్లుఅర్జున్​
ప్రభాస్​
అల్లరినరేశ్​

ఇదీ చూడండి: యూఎస్​కు రజనీ.. కేంద్రం అనుమతి

ABOUT THE AUTHOR

...view details