తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రెబల్​స్టార్-డైలాగ్​ కింగ్​​ ఫన్నీ వీడియో చూశారా..?

టాలీవుడ్​ స్టార్​ నటులు మోహన్​ బాబు​, ప్రభాస్​ సరదాగా సంభాషించుకున్నారు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

వైరల్​గా ఫసక్​రాజాతో.. రెబల్​స్టార్​ ఫన్నీ వీడియో

By

Published : Nov 22, 2019, 5:21 AM IST

డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు.. డార్లింగ్‌ ప్రభాస్​ కలిస్తే చాలా సరదాగా ఉంటారు. గతంలోనూ వీరిద్దరూ కలిసి 'బుజ్జిగాడు'లో మాస్​ క్యారెక్టర్లు పోషించారు. తాజాగా వీరిద్దరూ బయట కలిసి సంభాషించుకున్నారు. వయసులో, నటనలో సీనియర్‌ అయిన మోహన్‌బాబు.. ప్రభాస్‌తో కలిసి సందడి చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

ఇంతకీ ఆ ఫన్నీ సంభాషణ ఏంటో తెలుసా? మోహన్‌బాబు, ప్రభాస్‌ల మధ్య వారి ముక్కుకు సంబంధించి చర్చ వచ్చింది. అప్పుడు ప్రభాస్‌ మాట్లాడుతూ.. తన ముక్కు చాలా పదునుగా ఉంటుందని, చిన్నప్పుడు దానితో టమోటాలు కోశానని అంటాడు. అంతేకాకుండా 'మీరేం కోశారు' అని మోహన్‌బాబును అడిగాడు. మోహన్‌బాబు ఆశ్చర్యపోతూ చూస్తూ.. 'కోడి మెడ కోశా' అని సమాధానం ఇవ్వగానే నవ్వుల పువ్వులు పూశాయి. మరి డైలాగ్‌ కింగ్‌ అంటే ఆ మాత్రం పంచ్‌ ఉండాలి కదా!

మోహన్‌బాబు, ప్రభాస్‌లు కలిసి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'బుజ్జిగాడు' చిత్రంలో నటించారు. 2008లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ABOUT THE AUTHOR

...view details