నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజైనా, ఆయన చిత్రం విడుదలైన అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ ఏడాది బాలయ్య పుట్టినరోజు సర్ప్రైజ్ సాంగ్‌తో వేడుకలు ఒక రోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఫ్యాన్స్‌ను అలరించడానికి ఆయనే స్వయంగా ఓ పాట పాడి విడుదల చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'జగదేక వీరుని కథ' చిత్రంలోని 'శివ శంకరీ' పాటను బాలయ్య స్వయంగా ఆలపించారు. ఆ సినిమాలోని వీడియోకు తన గాత్రాన్ని కలిపి విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.