అగ్ర కథానాయకులు, భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్స్.. చిన్న సినిమాలు, యువ హీరోలతో తెరపై కనిపించిన సందర్భాలు అరుదు. కుర్రహీరోలతో చేస్తే తమకున్న మార్కెట్ పడిపోతుందనే భయం కూడా దీనికొక కారణం. అయితే ఇప్పుడు ఆ భయాన్ని వీడి.. ట్రెండ్ మార్చేందుకు సిద్ధమవుతున్నారు కొందరు భామలు. స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూనే.. యువ హీరోలతో స్టెప్పులేసేందుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కుర్ర హీరోల సరసన నటిస్తున్న ముద్దుగుమ్మలెవరు? ఏ హీరోలతో సినిమాలు చేస్తున్నారు?
అఖిల్.. నితిన్‌లతో పూజ
'రాధేశ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్'లాంటి సినిమాల్లో అగ్రహీరోలతో జోడీకడుతూ జోరు మీదుంది పూజాహెగ్డే. హిందీలో రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్‌లతో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా క్రేజీ పెంచుకుంది. పెద్ద సినిమాలతో తీరిక లేకుండా ఉన్న పూజాహెగ్డే ఇప్పుడు ట్రెండ్ మార్చేంది. కుర్ర హీరోలతో సినిమాలు ఒప్పుకుంటూ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికే అఖిల్‌తో 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చేసిన ఈ భామ తాజాగా మరో సినిమాను అంగీకరించింది. వంశీ పైడిపల్లి చేస్తున్న ఓ చిత్రంలో నితిన్‌తో కలిసి నటించేందుకు ఓకే చెప్పేసింది. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తుందని సమాచారం.
తమన్నా.. ఇద్దరితో
టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోల పక్కన నటించి హిట్లు కొట్టింది మిల్కీ బ్యూటీ. తన అందచందాలతో అన్నిచోట్లా బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించింది. ప్రభాస్, ఎన్టీఆర్, ధనుష్, విక్రమ్, అక్షయ్ కుమార్‌లతో సూపర్ హిట్ సినిమాల్లో చేసిన తమన్నా కూడా రూటు మార్చింది. యువ హీరోలతోనూ నటించేందుకు వెనకాడట్లేదు. ఇప్పటికే 'అంధాదున్' తెలుగు రీమేక్ 'మాస్ట్రో'లో నితిన్‌తో కలిసి నటిస్తోంది. దీంతో పాటు 'గుర్తుందా శీతాకాలం' లాంటి చిన్న సినిమాలో సత్యదేవ్‌తో రొమాన్స్ చేయనుంది. 'బ్లఫ్ మాస్టర్', 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో ఆకట్టుకున్న ఈ కుర్రహీరో సరసన తమన్నా నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. హిందీలో జాన్ అబ్రహంతో పాటు, వెంకటేశ్ సరసన సూపర్‌హిట్ మూవీ ‘ఎఫ్2’ సీక్వెల్ 'ఎఫ్3'లోనూ ఆమె నటిస్తోంది.
పొలిశెట్టితో అనుష్క శెట్టి