లాక్ డౌన్ నిబంధనల మేరకు పరిమిత బృందంతో సినిమాల చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని పరిశ్రమవర్గాలు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. లాక్డౌన్ రోజులకు సంబంధించి, థియేటర్లలో విద్యుత్ బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి వినతిపత్రాన్ని అందజేసింది. వైరస్ భారినపడి విలవిలలాడుతోన్న టాలీవుడ్‌ను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి.
తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాతల మండలి వినతిపత్రం - TALASANI TOLLYWOOD PRODUCERS
కరోనాతో ఇబ్బందులు పడుతున్న సినీ పరిశ్రమను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన టాలీవుడ్ నిర్మాతల మండలి.. మంత్రి తలసానికి వినతి పత్రమిచ్చింది.
తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో టాలీవుడ్ నిర్మాతలు
ప్రభుత్వానికి తెలుగు చలన చిత్రపరిశ్రమ విజ్ఞప్తులు
- సినిమా థియేటర్ల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి
- సంవత్సరం పాటు నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, స్టూడియోలకు జీఎస్టీ చెల్లింపు రద్దు చేయాలి.
- లాక్డౌన్ నిబంధనలు మేరకు పరిమితమైన బృందంతో సినిమా షూటింగ్స్, నిర్మాణాంతర కార్యక్రమాలకు అనుమతివ్వాలి
- జాప్యం లేకుండా సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలి
- ప్రభుత్వ పార్క్‌లు, చారిత్రక ప్రదేశాల్లో ఎలాంటి రుసుము తీసుకోకుండా చిత్రీకరణలకు అనుమతివ్వాలి.
- ప్రైవేట్ అతిథి గృహాల్లో నిర్మాతలు సరైన భద్రత తీసుకునే చిత్రీకరణలు జరుపుతారు. ప్రత్యేకంగా వాటి కోసం పోలీసుల అనుమతి అవసరం లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలి.
- పరిమిత బడ్జెట్లో సినిమాలు తీసే నిర్మాతల సౌకర్యార్థం మినీ థియేటర్ల ఏర్పాటుకు వెంటనే అనుమతి ఇవ్వాలి.
- సినీ పరిశ్రమను ప్రత్యేక పరిశ్రమ హోదా గుర్తించాలి.
- డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల అధిక ఛార్జీల వసూలు నుంచి నిర్మాతలను కాపాడాలి.
- చిన్న నిర్మాతలను బతికించేందుకు, వారు తీసే సినిమాల ప్రదర్శనకు ఐదో ఆటకు అనుమతివ్వాలి.
- భారీ, మధ్యతరహా బడ్జెట్ చిత్రాలకు ఒకటే టికెట్ ధర ఉండేలా అనుమతివ్వాలి
- పెండింగ్ లో ఉన్న ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి.