తెలంగాణ

telangana

ETV Bharat / sitara

TOLLYWOOD: 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలే ముందు! - movie news

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో త్వరలో షూటింగ్​లు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారీబడ్జెట్​ చిత్రాలైన 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' చిత్రీకరణలను తొలుత మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Tollywood producers start planning for re-start of shoots
చిరంజీవి రామ్​ చరణ్

By

Published : Jun 3, 2021, 5:30 AM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు సినిమా, సీరియల్ షూటింగ్​లు చాలావరకు నిలిచిపోయాయి. ఇటీవల లాక్​డౌన్​లో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో, త్వరలో వీటిని తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీరియళ్ల చిత్రీకరణలు తొలుత మొదలుకానున్నాయని సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమా పోస్టర్

ఆ తర్వాత భారీ బడ్జెట్​ చిత్రాలు 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' షూటింగ్​లు ముందు మొదలు కానున్నాయని తెలుస్తోంది. అనంతరం జులై చివరికల్లా చిత్రీకరణలు పూర్తిస్థాయిలో జరపాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరోవైపు థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులు లభిస్తే, వాయిదా పడిన సినిమాలన్నీ ప్రేక్షకుల అలరించనున్నాయి.

ఇది చదవండి:S.S Rajamouli: హాలీవుడ్​కు రాజమౌళి

ABOUT THE AUTHOR

...view details