టాలీవుడ్ నిర్మాత మహేశ్ కోనేరు కన్నుమూశారు. ఈ ఉదయం విశాఖలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పేరుతో తెలుగులో పలు చిత్రాలను ఆయన నిర్మించారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌కు మహేశ్ కోనేరు వ్యక్తిగత పీఆర్‌గా పనిచేశారు. 118, తిమ్మరుసు, మిస్ ఇండియా చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపై తారక్ సంతాపం ప్రకటించారు.
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి - mahesh koneru heart attack
నిర్మాత మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించారు. వైజాగ్‌లోని తన నివాసంలో ఈయన తుదిశ్వాస విడిచారు.

మహేశ్ కోనేరు
"బరువెక్కిన గుండెతో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. నా ప్రియమైన మిత్రుడు కోనేరు ఇక లేరన్న వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. చెప్పడానికి మాటలు రావట్లేదు. తన కుటుంబానికి, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా" అంటూ ట్వీట్ చేశారు.
Last Updated : Oct 12, 2021, 11:35 AM IST