తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమాల్లో 'రాజకీయం'.. చిరుతో పాటు ఆ హీరోలు - telugu political movies

టాలీవుడ్​లో ప్రస్తుతం పలువురు హీరోలు రాజకీయ నేపథ్య కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఆ సినిమాల సంగతేంటి?

Tollywood political movies, which shooting is in progress
తెలుగు పొలిటికల్ మూవీస్

By

Published : Feb 7, 2021, 5:31 PM IST

Updated : Feb 7, 2021, 8:35 PM IST

ఓ సామాన్యుడు, బడా నేతలను ఎదుర్కొని, జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అనుకోకుండా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా మారిన ఓ రిపోర్టర్, ప్రజలకు మంచిచేస్తే.. తండ్రి మరణంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఓ యువకుడు, ప్రజలకు మంచి చేయాలనే క్రమంలో సహచర పార్టీ నేతల నుంచే కష్టాలు ఎదుర్కొంటే.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలు. వాటి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే పొలిటికల్ బ్యాక్​డ్రాప్​తో వచ్చిన చాలా తెలుగు సినిమాల్ని ఇప్పటికే మీరు చూసేసుంటారు. అది ఆసక్తికర జానర్ కావడం వల్ల దర్శకులూ రాజకీయ నేపథ్య కథాంశంతో ఇంకా చిత్రాల్ని తీస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్​బాబు, సాయిధరమ్ తేజ్, రాజ్​ తరుణ్ లాంటి కథానాయకులు ప్రస్తుతం పొలిటికల్​ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

'లూసిఫర్' రీమేక్​లో చిరు

'లూసిఫర్​' తెలుగు రీమేక్​లో చిరు టైటిల్ రోల్ చేస్తున్నారు. అరే ఒరిజినల్​ సినిమా డబ్బింగ్ వెర్షన్ ఇప్పటికే మనం చూశాం కదా! మళ్లీ చేస్తున్నారేంటి అని చాలామంది అనుకున్నారు. కానీ మాతృక కథలో చాలా మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, తెలుగు ప్రేక్షకులకు తమ సినిమా కచ్చితంగా నచ్చుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. కోలీవుడ్​ దర్శకుడు మోహన్​రాజ్ దీనిని తెరకెక్కిస్తుండటం మరో ఆసక్తికర అంశం.

దర్శకుడు మోహన్​రాజాతో చిరంజీవి

కథేంటి?

రాష్ట్ర ముఖ్యమంత్రి అకస్మాత్తుగా మరణిస్తారు. దీంతో ఆ స్థానాన్ని చేజిక్కుంచుకుని, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని ఆయన కుమార్తె రెండో భర్త(అల్లుడు) భావిస్తాడు. కానీ సీఎం సన్నిహితుడైన స్టీఫెన్ దానిని అడ్డుకుంటాడు. చివరకు ఏం జరిగింది అనేదే కథ.

మోహన్​బాబు 'సన్నాఫ్ ఇండియా'

'దేశభక్తి అతడి రక్తంలోనే ఉంది.. సన్నాఫ్ ఇండియాను కలుసుకోండి' అని ఇటీవల మోహన్​బాబు తన కొత్త సినిమా గురించి ట్వీట్ చేశారు. దీని బట్టి ఇది పూర్తి పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. ఇందులో ప్రజల కోసం పోరాడే నాయకుడిగా కలెక్షన్ కింగ్ నటించనున్నట్లు తెలుస్తోంది.

మోహన్​బాబు సన్నాఫ్ ఇండియా సినిమా

సాయితేజ్ 'రిపబ్లిక్'

ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన మెగాహీరో సాయితేజ్.. తొలిసారి 'రిపబ్లిక్' టైటిల్​తో తీస్తున్న రాజకీయ నేపథ్య సినిమాలో నటిస్తున్నారు. 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా దర్శకుడు. ఇటీవల విడుదలైన ప్రీ లుక్​ ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది.

సాయితేజ్ 'రిపబ్లిక్' మూవీ

రాజ్​ తరుణ్ 'పవర్​ ప్లే'

కెరీర్​ ప్రారంభం నుంచి లవర్​బాయ్ తరహా పాత్రలే చేసిన యువ కథానాయకుడు రాజ్​ తరుణ్.. తొలిసారి ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన 'పవర్ ప్లే' సినిమా ట్రైలర్​ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు.

రాజ్​ తరుణ్ పవర్ ప్లే మూవీ

ఇవీ చదవండి:

Last Updated : Feb 7, 2021, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details