Tollywood Overtake Bollywood: 'బాహుబలి', 'కేజీఎఫ్' చిత్రాల తర్వాత దక్షిణాది భారీ చిత్రాలన్నీ పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. 'పుష్ప' భారీ విజయంతో ఈ వేగం రెట్టింపైంది. అదే సమయంలో బాలీవుడ్‌లో ఒకప్పటి వేగం కనిపించడం లేదంటున్నారు సినీ విమర్శకులు. బాలీవుడ్ స్థానాన్ని దక్షిణాది చిత్రాలు ఆక్రమించడం మొదలైంది అంటున్నారు. కరోనా మొదలయ్యాకా ఒకటి రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలైనా వావ్ అనిపించేలా సత్తా చాట లేదు. ఇదే సమయంలో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు చిత్రసీమ భారీ విజయాలు అందుకుంది. "దక్షిణాది చిత్రాలు హిందీ చిత్రాలను దాటేస్తున్నాయి. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది సినిమాల శాటిలైట్ హక్కులూ భారీ ధర పలుకుతున్నాయి. బాక్సాఫీసు వద్ద వసూళ్లు అదే స్థాయిలో ఉంటున్నాయి" అంటున్నారు 'పుష్ప' హిందీ హక్కులు దక్కించుకున్న మనీష్‌షా.
బాలీవుడ్ ఎందుకిలా!
బాలీవుడ్ నుంచి భారీ సినిమా వస్తుందంటే ఇతర అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ అంచనాలుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. భారీ బాలీవుడ్ చిత్రాలు మూస దారిలో వెళుతున్నాయి. కథలో కొత్తదనం ఉండటం లేదు, ఎక్కువమందికి చేరువయ్యే కథలు రావడం లేదు.. ఇలాంటి వ్యాఖ్యలు బాలీవుడ్‌పై సర్వసాధారణమయ్యాయి. ఇటీవలే అజిత్‌తో 'వలిమై' చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్ మాట్లాడుతూ "దక్షిణాది సినిమాల్లో యాక్షన్, డ్రామా, కామెడీ.. ఈ మూడు బాగా ఉంటున్నాయి. ఇవే మాస్ ప్రేక్షకులకు బాగా చేరువచేస్తున్నాయి" అంటున్నారు.
అంచనాల పాన్ ఇండియా