తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవర్​స్టార్​ సినిమా టైటిల్​ అప్​డేట్​.. రవితేజ కొత్త చిత్రం​ - avika gor birthday news

చిత్రసీమలో కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. మాస్​ మహారాజ్​ రవితేజ కొత్త చిత్రం అప్​డేట్​తో పాటు కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ కొత్త సినిమా టైటిల్​, అవికా గౌర్​ బర్త్​డే పోస్టర్​ అప్​డేట్స్​​ ఇందులో ఉన్నాయి.

Tollywood New Movie Updates
పవర్​స్టార్​ సినిమా టైటిల్​ అప్​డేట్​.. రవితేజ కొత్త చిత్రం​

By

Published : Jun 30, 2021, 10:18 PM IST

మాస్​ మహారాజ్​ రవితేజ హీరోగా మరో చిత్రాన్ని రూపొందించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన నటిస్తున్న 68వ చిత్రానికి సంబంధించిన అప్​డేట్​ను గురువారం ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో రవితేజ సరసన దివ్యాంశ్​ కౌశిక్​ హీరోయిన్​గా ఎంపికైంది. ఈ సినిమా ద్వారా శరత్​ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్​కు పరిచయం కానున్నాడు.

రవితేజ కొత్త సినిమా అప్​డేట్​

పవర్​స్టార్​ కొత్త చిత్రం

'కేజీఎఫ్​' చిత్రంతో బ్లాక్​బాస్టర్​ను ఖాతాలో వేసుకున్న హోంబళే నిర్మాణసంస్థ.. ఇప్పుడు ప్రభాస్​తో 'సలార్​' సినిమాను తెరకెక్కిస్తోంది. అయితే ఈ బ్యానర్​లో మరో కొత్త చిత్రం రూపొందనుంది. కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ హీరోగా పవన్​ కుమార్​ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్​ జరుపుకొంటోంది. దీనికి సంబంధించిన టైటిల్​ను జులై 1 తేదీన ఉదయం 11.46 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

పునీత్​ రాజ్​కుమార్​ కొత్త సినిమా అప్​డేట్​

ఆరు చిత్రాల్లో అవికా..

సినిమా అవకాశాల విషయంలో జోరు చూపిస్తోంది యువ నాయిక అవికా గోర్‌. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. బుధవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆయా చిత్ర బృందాలు అవికాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్లను విడుదల చేశాయి. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది అవికా. ఆ వివరాలవీ..

ఆది సాయి కుమార్‌ సరసన ఆమె నటిస్తోన్న 'అమరన్‌' చిత్రం ఏప్రిల్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బలవీర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. మరోవైపు యువ నటులు నవీన్‌ చంద్ర, కల్యాణ్‌ దేవ్‌, వెన్నెల రామారావులతో సందడి చేయనుంది. హేమంత్‌ దర్శకత్వం వహిస్తోన్న ఓ చిత్రంలో సవాలు విసిరే పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. స్వీయ నిర్మాణంలో 'పాప్‌కార్న్‌' అనే చిత్రాన్ని ప్రకటించింది.

అవికా గౌర్​ కొత్త సినిమా అప్​డేట్​
అవికా గౌర్​ కొత్త సినిమా అప్​డేట్​
అవికా గౌర్​ కొత్త సినిమా అప్​డేట్​
'నేను లేని.. నా ప్రేమకథ' సాంగ్​ రిలీజ్​ పోస్టర్​

ఇదీ చూడండి..భర్త అంత్యక్రియలు నిర్వహించిన బాలీవుడ్​ నటి

ABOUT THE AUTHOR

...view details