కరోనాతో సాగుతోన్న యుద్ధంలో వైద్యులు, పోలీసులు, మీడియా, పారిశుద్ధ్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇంట్లో గడుపుతూ ఆ యుద్ధానికి సహకరించాల్సిన జనం మాత్రం, బయటికెళ్లి శత్రువుకు మరింత బలాన్నిస్తున్నారు. ఇది తగదంటూ జనంలో చైతన్యం పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్.
'వినరా సోదరా! వినకుంటే ఇల్లు ఆగమైతదిరా..!'
కరోనాపై అవగాహన కల్పించేలా సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఓ పాటను రూపొందించారు. సుక్క రామ్ నరసయ్య అందించిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్‌గా మారింది.
వినరా.. సోదరా! వినకుంటే ఇల్లు ఆగమైతది కదరా..!
'వినరా.. వినరా.. సోదరా! వినకుంటే ఇల్లు ఆగమైతది కదరా' అంటూ రచయిత సుక్క రామ్ నరసయ్య అందించిన లిరిక్స్‌కు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించి.. స్వయంగా ఆలపించారు. ఈ పాట నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి..'నా సినిమాను బిగ్‌స్క్రీన్‌లోనే చూస్తారు'