తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్ మార్చ్: ఈ నెల ప్రేక్షకులకు వినోదమే వినోదం!

ఫిబ్రవరి ముగిసింది. ఈ నెలలో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన పలు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇందులో 'జాంబీరెడ్డి', 'ఉప్పెన', 'నాంది' మంచి ఫలితాల్ని రాబట్టాయి. ఇక మార్చి వంతు వచ్చింది. ఈ నెలలోనూ పలు టాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం.

Tollywood movies which will release in March
టాలీవుడ్ మార్చ్

By

Published : Feb 28, 2021, 9:32 AM IST

కరోనా లాక్​డౌన్ ఆంక్షల తర్వాత ప్రస్తుతం థియేటర్లు హౌజ్​పుల్​ కలెక్షన్లతో దూసుకెళ్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్లను ఖరారు చేసుకున్నాయి. టాలీవుడ్​కు ఎంతో కలిసొచ్చే సంక్రాంతి సీజన్​లో మిశ్రమ స్పందన లభించింది. ఈ సీజన్​లో పలు చిత్రాలు విడుదలవగా 'క్రాక్'​ మాత్రమే బాక్సాఫీస్ వద్ద బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఆ తర్వాత విడుదలైన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?', 'జాంబీరెడ్డి', 'ఉప్పెన', 'నాంది' మంచి వసూళ్లతో హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక మార్చి వంతు వచ్చింది. సాధారణంగా అయితే ఈ నెలను అన్​సీజన్​గా భావిస్తారు. కానీ కరోనా వల్ల ఇప్పటికే చాలా చిత్రాలు వాయిదా పడిన కారణంగా ఈనెలలోనూ పలు చిత్రాలను విడుదల చేసేందుకు ముందుకొచ్చారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఈ నెలలో విడుదల కానున్న సినిమాలు ఏంటో చూద్దాం.

మార్చి 5

ఏ1 ఎక్స్​ప్రెస్

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఏ1 ఎక్స్​ప్రెస్'. జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి సినిమాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సందీప్​కు 25వ చిత్రమైన దీనితో 14 మంది కొత్త వారు పరిచయమవుతుండటం విశేషం. ఇందులో నటీనటులు, పలువురు సాంకేతిక నిపుణులు ఉన్నారు.

ఏ1 ఎక్స్​ప్రెస్

పవర్​ ప్లే

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతోన్న పొలిటికల్ డ్రామా 'పవర్ ప్లే'. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూర్ణ, హేమల్ హీరోయిన్లుగా నటించారు.ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ మూవీ కూడా మార్చి 5న విడుదలవబోతుంది.

పవర్ ప్లే

షాదీ ముబారక్

ప్రముఖ సీరియల్​ 'మొగలిరేకులు' ఫేం సాగర్​(ఆర్​.కె.నాయుడు) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'షాదీ ముబారక్'. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందింది. దృశ్య ర‌ఘునాథ్‌ కథానాయిక. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆశిష్​ శ్రీవాస్తవ్​ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

షాదీ ముబారక్

మార్చి 11 (మహా శివరాత్రి)

శ్రీకారం

శర్వానంద్​, ప్రియంకా మోహన్​ జంటగా నటించిన చిత్రం 'శ్రీకారం'. బి.కిశోర్‌ దర్శకత్వం వహించారు. యువత కూడా వ్యవసాయం వైపు దృష్టిసారించాలనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

శ్రీకారం

జాతి రత్నాలు

నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్‌ దర్శకుడు. ముగ్గురు యువకుల జీవితంలో 'లైఫ్‌ అండ్‌ డెత్‌' పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏంటి? దాన్ని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? చివరకు ఆ సమస్య నుంచి బయటపడ్డారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జాతి రత్నాలు

గాలి సంపత్

యువ నటుడు శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'గాలి సంపత్‌'. స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 11న థియేటర్లలో సందడి చేయనుంది.

గాలి సంపత్

మార్చి 19

శశి

ఆది సాయికుమార్​ హీరోగా శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'శశి'. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఆది కొత్త లుక్​లో కనిపిస్తున్నారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శశి

చావు కబరు చల్లగా

కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి జంటగా 'చావు కబురు చల్లగా' చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోందీ సినిమా. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కౌషిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్‌బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కూడా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది,

చావుకబురు చల్లగా

మార్చి 26

రంగ్ దే

యువహీరో నితిన్, కీర్తి సురేశ్ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రంగ్ దే

అరణ్య

దగ్గుబాటి హీరో రానా కథానాయకుడిగా నటించిన బహుభాషా చిత్రం తెలుగులో 'అరణ్య' పేరుతో విడుదలవనుంది. విష్ణు విశాల్‌ కీలక పాత్ర పోషించాడు. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. హిందీలో 'హాథీ మేరే సాథీ', తమిళ్‌లో 'కాండన్‌' పేర్లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.

అరణ్య

మార్చి 27

తెల్లవారితే గురువారం

శ్రీసింహా, చిత్ర శుక్లా జంటగా మిషా నారంగ్ తెలుగు తెరకు పరిచయమవుతున్న చిత్రం 'తెల్లవారితే గురువారం'. మణికాంత్ దర్శకుడు. వారాహి చలన చిత్ర పతాకంపై రజినీ కొర్రపాటి నిర్మించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది.

తెల్లవారితే గురువారం

ఇవీ చూడండి: ఇంట గెలిచారు.. రచ్చ గెలుస్తారా?

ABOUT THE AUTHOR

...view details