Sarkaru Vaari Paata Second Song: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి 'పెన్నీ' అనే రెండో పాట ప్రోమో రిలీజ్ చేసింది చిత్ర బృందం. పూర్తి పాటను మార్చి 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాంతో పాటే సూపర్ స్టైలిష్‌గా ఉన్న మహేశ్ ఫొటోను షేర్ చేసింది. ఈ పాటలో మహేశ్‌బాబు కూతురు సితార ఘట్టమనేని స్టైలిష్ స్టెప్పులతో అలరించింది.
ఈ చిత్రంలో మహేశ్‌బాబు.. బ్యాంకు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయిక. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హోలీ వేడుకల్లో ప్రియాంక..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. తన భర్త నిక్ జోనస్‌తో కలిసి లాస్ ఏంజిల్స్ స్వగృహంలో హోలీ వేడుకలు జరుపుకుంది. రంగులు చల్లుకుంటున్న ఫోటోలు, భర్తపై ముద్దులు కురిపిస్తున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.