మెగా హీరో వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'కొండపొలం'. క్రిష్ దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఇందులో రకుల్ హీరోయిన్గా నటించగా, ఆమె ఫస్ట్‌లుక్ టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో రకుల్ ఓబులమ్మ పాత్రలో కనిపించనుంది. అక్టోబరు 8న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
సుశాంత్ సినిమా ట్రైలర్
సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' ట్రైలర్ విడుదలైంది. ఎస్ దర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతమందించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఉత్కంఠ అయిన సన్నివేశాలు, కొంచెం కామెడీ ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 27న సినిమా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
'ఎస్.ఆర్ కళ్యాణమండపం' ఓటీటీలోకి..
ఆగస్టు 6న థియేటర్లలో విడుదలైన 'ఎస్ఆర్.కళ్యాణమండపం' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఆగస్టు 28న ఆహాలో రిలీజ్ అవుతున్నట్లు సోమవారం ప్రకటించారు. కిరణ్ అబ్బవరం, సాయికుమార్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలు పోషించారు. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించారు.