- నితిన్, కీర్తీ సురేశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'రంగ్‌దే'. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
- విభిన్న చిత్రాల దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న చిత్రం 'శాకుంతం'. ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ గతేడాదే ప్రకటించారు. ఇందులోని ప్రధానపాత్రకు చిత్రబృందం సమంతను ఎంపికచేసింది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
- కన్నడ హీరో ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కిన చిత్రం 'పొగరు'. అదే పేరుతో తెలుగులో డబ్ చేసి త్వరలోనే విడుదల చేయనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆ సినిమాలోని డైలాగ్ ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
-
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న కొత్త చిత్రం 'కిన్నెరసాని'. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింపైజ్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
-
'కలర్ ఫొటో' చిత్రంతో కథానాయకుడిగా మారిన హస్యనటుడు సుహాస్ ప్రధానపాత్రగా మరో సినిమా రూపొందనుంది. 'రైటర్. పద్మభూషణ్' అనే టైటిల్‌తో తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వగా.. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
-
యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'లక్ష్య'. ఆర్చర్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. నాగశౌర్య ప్రస్తుతం 'వరుడు కావలెను' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.
-
'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న చిత్రం 'మహా సముద్రం'. ఇందులో హీరో శర్వానంద్, సిద్ధార్థ్‌లు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకొంటోంది.
-
కోలీవుడ్ నటుడు బాబీ సింహా ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం 'వసంత కోకిల'. నూతన సంవత్సరం సందర్భంగా ఆ చిత్రం నుంచి సెకండ్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
-
బాలీవుడ్లో సూపర్‌హిట్టైన 'అంధాదున్' తమిళ రీమేక్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రానికి 'అంధగన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో నటి సిమ్రన్ కీలకపాత్ర పోషించనున్నారు. 'అంధాదున్' తెలుగు రీమేక్‌లో హీరో నితిన్ నటిస్తున్నారు.
-
సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'నగరం' చిత్రాన్ని.. బాలీవుడ్లో 'ముంబయి కర్' అనే టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో 'మీర్జాపూర్' నటుడు విక్రాంత్ మాస్సే, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శివన్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు.
-
హాస్యనటుడు సప్తగిరి హీరోగా 'ఎయిట్(8)' చిత్రం రూపొందుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
టాలీవుడ్ నుంచి న్యూఇయర్ అప్డేట్స్! - mumbai kar movie news
టాలీవుడ్ కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులను శుభాకాంక్షలు తెలుపుతూ.. పలు సినిమాల ఫస్ట్‌లుక్‌లను చిత్రబృందాలు విడుదల చేశాయి.
టాలీవుడ్ నుంచి న్యూఇయర్ అప్డేట్స్!