ఇది దసరా కాదు.. టాలీవుడ్ అప్డేట్ల పండగ - టాలీవుడ్ వార్తలు
దసరా సందర్భంగా టాలీవుడ్లో తెరకెక్కుతున్న 20కి పైగా సినిమాల కొత్త పోస్టర్లు వచ్చాయి. ఇందులో కొన్ని చిత్రాల విడుదల తేదీల ప్రకటించగా, మరికొన్ని ఆదివారమే లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
ఇది దసరా కాదు.. టాలీవుడ్ అప్డేట్ల పండగ
కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు ఈ మధ్యే మళ్లీ మొదలు కావడం వల్ల చిత్ర పరిశ్రమలో సందడి వాతావరణ నెలకొంది. అగ్ర హీరోలు షూటింగ్స్‌కు వస్తుండటం వల్ల చిత్రీకరణల జోరు పెరిగింది. దసరా అంటే కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడేది. అయితే, ఆ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. అయినా, మనవాళ్లు అభిమానులను అలరించేందుకు పండగ శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమాల పోస్టర్లను విడుదల చేశారు.
Last Updated : Oct 25, 2020, 7:39 PM IST