లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదా పడిన చిత్రాలు అన్ని సమస్యలను అధిగమిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఫిబ్రవరి 12న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా 'ఉప్పెన' విడుదలవగా.. అల్లరి నరేశ్ 'నాంది', సుమంత్ 'కపటధారి' 19న ప్రేక్షకుల్ని పలకరించాయి. కాగా, నితిన్, చంద్రశేఖర్ ఏలేటి కలయికలో రూపొందిన 'చెక్', శ్వేతా నందిత అక్షర ఫిబ్రవరి 26న థియేటర్లకు వచ్చాయి. మార్చి నుంచి మరిన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్న మూవీలేంటో చూద్దాం.
మార్చిలో సందడే సందడి
మార్చి నెలను బాక్సాఫీస్ అన్‌సీజన్‌గా భావిస్తారు. కానీ ఈసారి కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ నెలలోనూ పలు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. ఇందులో మార్చి 5న సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన 'ఏ1 ఎక్స్‌ప్రెస్', రాజ్‌తరుణ్ హీరోగా రూపొందిన 'పవర్‌ప్లే' , ప్రముఖ సీరియల్ 'మొగలిరేకులు' ఫేమ్ సాగర్ హీరోగా నటించిన 'షాదీ ముబారక్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరో వారంలో శర్వానంద్ 'శ్రీకారం', నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటించిన 'జాతిరత్నాలు', శ్రీ విష్ణు 'గాలి సంపత్' మార్చి 11న థియేటర్లకు రానున్నాయి. తర్వాత వారంలో ఆది సాయికుమార్ 'శశి', కార్తికేయ 'చావుకబురు చల్లగా' 19న విడుదలకానున్నాయి. ఇక చివరి వారంలో నితిన్ 'రంగ్‌దే', రానా 'అరణ్య' 26న, శ్రీసింహ 'తెల్లవారితే గురువారం' 27న అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
'వకీల్‌సాబ్' వచ్చేస్తున్నాడు
ఏప్రిల్ 2న గోపిచంద్ 'సీటీమార్' రానుండగా, ఇదే రోజున నాగార్జున 'వైల్డ్ డాగ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఏప్రిల్ 9న పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' థియేటర్లకు రానుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్‌స్టోరి' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని 'టక్ జగదీష్' కూడా 'లవ్‌స్టోరి'తో పోటీపడబోతుంది. ఇక ఏప్రిల్ 23న జయలలిత బయోపిక్ 'తలైవి' విడుదల కానుంది. ఇందులో కంగనా రనౌత్ హీరోయిన్. చివరగా ఏప్రిల్ 30న రానా-సాయిపల్లవిల 'విరాటపర్వం' విడుదలకాబోతుంది. ఒకే నెలలో సాయిపల్లవి నటించిన రెండు సినిమాలు విడుదల కానుండటం ఆమె అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
మేలో చిరు-బాలయ్య-వెంకీ సందడి
ఇక మే నెలలో ముగ్గురు అగ్రహీరోలు బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. మే 7న అక్కినేని అఖిల్, పూజా హెగ్డే నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రానుండగా.. ఒక వారం వ్యవధిలోనే వెంకటేశ్, చిరంజీవి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' మే 13న విడుదల కానుండగా.. మే 14న వెంకీ నటించిన 'నారప్ప' రాబోతుంది. చిరంజీవి 'ఆచార్య'తో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ పోటీపడబోతున్నారు. ఈయన నటించిన 'మరక్కార్' కూడా మే 13న థియేటర్లకు రానుంది. మే 28న బాలయ్య-బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమా విడుదలవనుంది. ఇక ఇదే రోజుల రవితేజ హీరోగా నటిస్తోన్న 'ఖిలాడి' ప్రేక్షకుల్ని పలకరించనుంది.
జూన్‌లో
కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించిన 'గుడ్‌లక్ సఖి' ఈనెల 3న విడుదల కానుంది. ఆకాశ్ పూరీ, కేతికా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'రొమాంటిక్' 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జులైలో ప్రభాస్‌తో వరుణ్ పోటీ