కరోనా పరిస్థితులతో ఆగిన 'నారప్ప' చిత్రం హైదరాబాద్‌లో పునఃప్రారంభమైంది. వెంకటేష్ కథానాయకుడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. లాక్‌డౌన్‌కు ముందే 60రోజుల చిత్రీకరణ పూర్తికాగా.. ఇప్పుడు భాగ్యనగరంలో తిరిగి షూటింగ్ ప్రారంభమైంది.
తిరిగి సెట్లో అడుగుపెట్టిన 'నారప్ప' - venkatesh movie update
వెంకటేష్ నటిస్తున్న 'నారప్ప' చిత్ర షూటింగ్ తిరిగి షురూ అయింది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఫ్యామిలీ నటుడుగా పేరున్న వెంకటేష్ ఈ చిత్రంలో మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "అనంతపురం జిల్లా పాల్తూరు గ్రామంలో ఈ చిత్రాన్ని మొదలుపెట్టి, తమిళనాడులోని కురుమలై, తెరికాడు రెడ్ డెసర్ట్‌లో కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రియమణి, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో 80శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. మిగిలిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అన్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్. కథ: వెట్రిమారన్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు.