తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భోళా శంకర్'​ అప్​డేట్.. టీజర్​తో 'బంగార్రాజు' - గాలోడు టీజర్

Tollywood Latest Updates: కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'బంగార్రాజు', 'భోళా శంకర్', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా విశేషాలున్నాయి.

movie updates
సినిమా అప్​డేట్స్

By

Published : Dec 31, 2021, 2:11 PM IST

Tollywood Latest Updates: కొత్త సంవత్సరం మొదటి రోజున టాలీవుడ్ నుంచి భారీ అప్​డేట్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు దర్శకనిర్మాతలు. అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తాజాగా న్యూ ఇయర్​ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి' భోళా శంకర్', నాగార్జున 'బంగార్రాజు' చిత్రాలకు సంబంధించిన అప్​డేట్స్ రానున్నాయని చిత్రబృందాలు ప్రకటించాయి. దీంతో పాటు మరికొన్ని సినిమాల అప్​డేట్స్ ఉన్నాయి. అవేంటో చూడండి.

భోళా శంకర్..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్'​ నుంచి భారీ అప్డేట్ రానుంది. న్యూ ఇయర్​ సందర్భంగా ఉదయం 9 గంటలకు సినిమాలోని చిరు లుక్​ను పరిచయం చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

భోళా శంకర్

బంగార్రాజు టీజర్..

'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతిశెట్టి కూడా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. కల్యాణ్​కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఇయర్​ సందర్భంగా ఈ సినిమా టీజర్​ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది చిత్రబృందం. ఉదయం 11. 22 గంటలకు టీజర్​ రిలీజ్​ చేయనుంది.

బంగార్రాజు

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..

సుధీర్​బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను శనివారం(జనవరి 1) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

విశాల్ 33..

విశాల్ 33

నటుడు విశాల్​ 33వ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్​ పోస్ట్​ను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి వివరాలను న్యూ ఇయర్ రోజున ప్రకటించనుంది.

'గాలోడు' టీజర్ విడుదల..

బుల్లితెరలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలతో కమెడియన్‌గా ప్రేక్షకాదరణ పొందిన నటుడు సుడిగాలి సుధీర్‌. వెండితెరపై హిట్‌ అందుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నాడు. 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌', '3 మంకీస్‌' చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ అనుకున్న పేరు రాలేదు. దీంతో ఆయన ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. సుధీర్‌ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'గాలోడు'.

రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. శుక్రవారం ఉదయం ‘గాలోడు’ టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ‘‘అదృష్టాన్ని నమ్ముకున్న వారు కష్టాలపాలు అవుతారు. కష్టాన్ని నమ్ముకున్నవారు అదృష్టవంతులవుతారు. నేను రెండింటినీ నమ్ముకోను. నన్ను నేను నమ్ముకుంటా’’ అంటూ సుధీర్‌ చెప్పే డైలాగ్‌తో సాగిన ఈ టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఫైట్‌ సీక్వెన్స్‌లు మెప్పించేలా సాగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

'ఖిలాడి' మూడో సాంగ్..

రవితేజ, మీనాక్షి జంటగా నటిస్తున్న చిత్రం 'ఖిలాడి'. తాజాగా ఈ సినిమా మూడో సాంగ్​ విడుదలైంది. 'అట్టా సూడకే' అంటూ సాగే ఈ సాంగ్​కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

మహిళల కష్టాలే కథలయ్యాయి.. సమాజం కళ్లు తెరిపించాయి!

LIGER Glimpse: 'లైగర్'​ గ్లింప్స్.. బాక్సర్​గా విజయ్​ అదరగొట్టాడుగా!

ABOUT THE AUTHOR

...view details