Telugu Movie Item Songs: టికెట్ కొనుక్కొని తెర ముందు కూర్చొన్న ప్రేక్షకుడికి లవ్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా నవరసాలతో విందు భోజనం వడ్డిస్తే అంతకు మించింది ఏముంటుంది. అయితే, ఆ విందు భోజనంతో పాటు, కిళ్లీలాంటి ఐటెమ్ సాంగ్ పడితే వచ్చే మజానే వేరు. అలాంటి అదిరిపోయే కిళ్లీలెన్నో ఈ ఏడాది ప్రేక్షకుడిని ఓ ఊపు ఊపాయి.. అవేంటో ఓ లుక్కేసేద్దామా!
భూమ్ బద్దలుతో మొదలై..
Krack movie item song: రవితేజ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మాస్, యాక్షన్ మూవీ 'క్రాక్'. ఇందులో అప్సరా రాణి నర్తించిన 'భూమ్ బద్దలు' సాంగ్ యువతను విశేషంగా అలరించింది. తమన్ అందించిన స్వరాలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ ఆలపించారు.
డించక్ డించక్ డింకా..
Red movie item song: రామ్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'రెడ్'. కిషోర్ తిరుమల దర్శకుడు. ఇందులో 'డించక్ డించక్' పాట మెప్పించింది. హెబ్బా పటల్ తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టింది. మణిశర్మ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఇచ్చారు. సాకేత్, కీర్తన శర్మ ఆలపించారు.
రంభ ఊర్వశి మేనక..
Alludu adurs movie item song: సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్ నటించిన చిత్రం 'అల్లుడు అదుర్స్'. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ సినిమాలోని 'రంభ ఊర్వశి మేనక' పాటు యువతను కట్టిపడేసింది. శ్రీమణి సాహిత్యం అందించగా, మంగ్లీ, హేమచంద్ర ఆలపించారు.
పైన పటారం..
Anasuya item song: 'చావు కబురు చల్లగా' అంటూ ప్రేక్షకులను పలకరించారు కార్తికేయ. కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అనసూయ 'పైన పటారం' పాటతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గీత రచయిత 'సా న రె' సాహిత్య అందించిన పాటకు జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు. మంగ్లీ, రామ్, సాకేత్ పాట పాడి అలరించారు.