తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్లాస్మా దానం చేయమని టాలీవుడ్​ హీరోలు ట్వీట్లు - nagarjuna chiranjeevi venkatesh

కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్లాస్మా దానం చేయాలని అభిమానులను కోరారు స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్​కు విజ్ఞప్తి చేశారు.

nagarjuna chiranjeevi venkatesh
నాగార్జున- చిరంజీవి- వెంకటేశ్

By

Published : May 3, 2021, 3:19 PM IST

'ప్లాస్మా దానం చేయండి. దీని వల్ల కరోనా నుంచి మరికొందరు త్వరగా కోలుకోవడానికి సహాయపడినవారవుతారు' అని సినీ నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు. 'కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో బాధితులు ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా ప్లాస్మా కొరత వల్ల చాలా మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మీరు ముందుకు రావాల్సిన సమయమిది. మీరు కరోనా నుంచి కోలుకున్నట్లయితే మీ ప్లాస్మాను దానం చేయండి. దీని వల్ల మరో నలుగురు కరోనా నుంచి వేగంగా కోలుకోవడానికి సహాయపడినవారవుతారు. ప్రత్యేకంగా నా అభిమానులూ ఈ కార్యక్రమంలో పాల్గొనవల్సిందిగా కోరుతున్నాను' అని తన ట్విట్టర్​లో పేర్కొన్నారు. ప్లాస్మా దానంపై సూచనలు, వివరాల కోసం చిరంజీవి ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ కార్యాలయాన్ని (040-23554849, 94400 55777) సంప్రదించవచ్చని అన్నారు.

వెంకటేశ్‌, నాగార్జున కూడా అభిమానులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. 'కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా ఇచ్చేందుకు సంబంధిత వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను' అని ట్వీట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details