తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మోడ్రన్ దుస్తుల నుంచి మాస్ గెటప్పుల్లోకి! - హెబ్బా పటేల్ ఓదెల్ రైల్వేస్టేషన్

విభిన్న పాత్రలతో అలరించేందుకు సిద్ధమవుతున్న కొందరు కథానాయికలు.. ఆ సినిమా ఫస్ట్​లుక్స్​తో అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంతకీ ఆ భామలెవరు? వారు చేస్తున్న పాత్రలేంటి?

tollywood heroines with mass getups in upcoming movies
మోడ్రన్ దుస్తుల నుంచి మాస్ గెటప్పుల్లోకి!

By

Published : Nov 16, 2020, 7:01 PM IST

హీరోయిన్ అంటే పూర్తిగా మేకప్​.. మోడ్రన్ దుస్తులు.. పాటల్లో మాత్రమే డ్యాన్సులు.. అనే పద్ధతికి నేటి తరంలోని కొందరు భామలు కుదరదని చెప్పేస్తున్నారు! హీరోలకు తామేం తక్కువ కాదు, ఎలాంటి పాత్రనైనా సరే చేస్తామని ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే డీ గ్లామర్​ రోల్స్​కు కూడా సై అంటున్నారు. ఇటీవలే వచ్చిన సదరు ఫస్ట్​లుక్స్ ఆ విషయాన్ని పక్కగా చెబుతున్నాయి. సినిమాలపై అంచనాల్ని పెంచుతున్నాయి.

కీర్తి సురేశ్- సాని కాయిదం

లాక్​డౌన్​ వేళ హీరోయిన్ కీర్తి సురేశ్ నటించిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఇప్పుడు కొత్త చిత్రం 'సాని కాయిదం' ఫస్ట్​లుక్​తో ప్రేక్షకుల ఒక్కసారిగా షాకయ్యారు. ఈ పోస్టర్​లో హత్య చేసిన నేరస్థురాలిగా కీర్తి కనిపించింది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

కొత్త సినిమా సాని కాయిదంలో కీర్తి సురేశ్

పాయల్ రాజ్​పుత్ - అనగనగా ఓ అతిథి

ఇప్పటివరకు హీరోయిన్​గా, ప్రత్యేక గీతాల్లో నర్తించిన పాయల్.. 'ఆహా' వెబ్​ చిత్రం 'అనగనగా ఓ అతిథి'లో పల్లెటూరి మహిళగా కనిపించనుంది. ఇటీవలే వచ్చిన టీజర్​, అందులోని పాయల్ నటన ఆకట్టుకుంటోంది.

అనగనగా ఓ అతిథి సినిమాలో పాయల్ రాజ్​పుత్

సాయిపల్లవి - విరాటపర్వం

ముద్దుగుమ్మ సాయిపల్లవి నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. ఇందులో అడవుల్లో తిరిగే జర్నలిస్ట్​గా ఈమె కనిపించనుందని అంటున్నారు. స్మారకవీరుల చిహ్నం దగ్గర పెన్ పట్టుకుని తదేకంగా ఆలోచిస్తూ ఉన్న సాయిపల్లవి ఫస్ట్​లుక్​ ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో రానా, ప్రియమణి, నందితా దాస్ తదితరులు నక్సలైట్ పాత్రల్లో కనిపించనున్నారు.

విరాటపర్వంలో సాయిపల్లవి

హెబ్బా పటేల్ - ఓదెల రైల్వేస్టేషన్

బ్యూటీ హెబ్బా పటేల్ కొత్త సినిమా 'ఓదెల రైల్వేస్టేషన్'. ఇందులో రాధ పాత్రలో ఈమె కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంపత్ నంది కథ అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

ఓదెల రైల్వేస్టేషన్​లో హెబ్బా పటేల్

ఇది చదవండి:

ABOUT THE AUTHOR

...view details