తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మల్టీప్లెక్స్​ వ్యాపారంలోకి టాలీవుడ్ తారలు! - విజయ్ దేవరకొండ ఏవీడీ సినిమాస్

టాలీవుడ్ స్టార్ హీరోలు ఓవైపు భారీ చిత్రాలతో అలరిస్తూనే తమకు సంబంధించిన వ్యాపారాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కొందరు బడా హీరోలు మల్టీప్లెక్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టారు. మరికొందరు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ వ్యాపారంలో అడుగుపెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు ఎవరో చూద్దాం.

Tollywood Heroes in Multiplex Business
మల్టీప్లెక్స్ వ్యాపారంలో అగ్రతారలు

By

Published : Mar 24, 2021, 5:45 PM IST

టాలీవుడ్​కు చెందిన స్టార్‌ హీరోలు సినీ ప్రియుల్ని మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక వైపు కథానాయకుడిగానే కాకుండా నిర్మాతలుగానూ కొత్త కథలతో అలరిస్తున్న పలువురు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. భారీ మల్టీప్లెక్స్‌లను నిర్మించి వినోదాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నారు. ఇప్పుటికే మహేశ్‌బాబు, ప్రభాస్‌.. ఆ రంగంలో రాణిస్తుండగా తాజాగా అల్లు అర్జున్‌, విజయ్ దేవరకొండ కూడా థియేటర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇంతకీ స్టార్‌ హీరోలకు చెందిన థియేటర్లు ఎక్కడ ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి..!

మహేశ్‌ 'ఏఎంబీ'

'ది గోల్డ్‌ వెర్షన్ ఆఫ్‌ సిల్వర్‌ స్క్రీన్‌' అనుభూతిని పొందాలంటే తప్పకుండా 'ఏఎంబీ సినిమాస్‌'కు వెళ్లాల్సిందే. మల్టీప్లెక్స్ రంగంలో ఖ్యాతి ఘడించిన ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు, నమ్రత దంపతులు ఈ థియేటర్‌ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 2018లో ప్రారంభమైన ఈ థియేటర్‌లో మొత్తం ఏడు స్క్రీన్స్‌ అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, టెక్నాలజీతో 'ఏఎంబీ సినిమాస్‌' ప్రతిఒక్కర్నీ ఆకర్షిస్తోంది. ఏఎంబీ సినిమాస్‌ అంటే 'ఏషియన్‌ మహేశ్‌బాబు సినిమాస్‌'.

మహేశ్‌ 'ఏఎంబీ'

ప్రభాస్‌ 'వి-ఎపిక్‌'

ఇండియాలో గల బిగ్‌ స్క్రీన్స్‌లో 'వి-ఎపిక్‌' ఒకటి. నెల్లూరు సూళ్లూరుపేటలోని జాతీయ రహదారి పక్కన ఇది నిర్మితమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ సభ్యులకు చెందిన ఈ థియేటర్‌లో స్టార్‌హీరో ప్రభాస్‌కు కొంత వాటా ఉంది. 2018లో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ దీనిని ప్రారంభించారు. ఇందులో ప్రదర్శితమైన మొదటి చిత్రం 'సాహో'. భారీ స్క్రీన్స్‌, సౌండ్ టెక్నాలజీతో సినీ వీక్షకులకు విభిన్న అనుభూతిని అందిస్తోంది.

ప్రభాస్‌ 'వి-ఎపిక్‌'

రౌడీకి రంగం సిద్ధం

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టారు. ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి ఆయన తన సొంత జిల్లాలో బిగ్‌ స్క్రీన్‌ నిర్మిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోని తిరుమల థియేటర్‌ స్థానంలో ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ సినిమాస్‌ నిర్మితమవుతోంది. ఇందులో మొత్తం మూడు స్క్రీన్స్‌ ఉండనున్నాయి. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. అలాగే, ఆయన త్వరలోనే హైదరాబాద్‌లోనూ 'ఏవీడీ' సినిమాస్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ 'ఏవీడీ'

బన్నీ రాకకు వేళాయే..!

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఓ భారీ సినిమా హాల్‌ను నిర్మిస్తున్నారు. కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్న ఆయన త్వరలోనే 'ఏఏఏ' సినిమాస్‌ పేరుతో మార్కెట్‌లోకి రానున్నారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌ స్థానంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. అతి త్వరలో ఈ మల్టీప్లెక్స్‌ అందుబాటులోకి రానుంది.

అల్లు అర్జున్ 'ఏఏఏ'

ABOUT THE AUTHOR

...view details