మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ సినిమా ట్రైలర్ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఆద్యంతం వినోద భరితంగా సాగిన ఈ ట్రైలర్.. సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. ఇందులో విరాట్, అమృత పాత్రల్లో తేజ్, నభా నటించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్: సాయితేజ్ 'సోలో'గా మెప్పిస్తాడా? - సోలో బ్రతుకే సో బెటర్‌లో సాయితేజ్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' ట్రైలర్ విడుదలైంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
నవ్వులు పంచుతున్న 'సోలో బ్రతుకే సో బెటర్' ట్రైలర్!
సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన 'సోలో బ్రతుకే సో బెటర్'కు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. తమన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కానుకగా వస్తున్న ఈ చిత్రం.. లాక్‌డౌన్ తర్వాత సినిమా హాళ్లలో సందడి చేయబోతున్న మొదటి సినిమాగా నిలవనుంది.
ఇదీ చూడండి:వృద్ధాశ్రమానికి మెగాహీరో సాయితేజ్ చేయూత