ప్రతి పండక్కి తప్పకుండా టీజర్, ట్రైలర్, పాట ప్రోమో, పోస్టర్ అంటూ తమ అభిమాన హీరోల చిత్రాలకు చెందిన ఏదో ఒక సర్ప్రైజ్ నెట్టింట విడుదల చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఇదే ట్రెండ్‌ను అలవాటు చేసుకున్న సాయి ధరమ్ తేజ్ ఈ విషయంలో మరింత ముందున్నాడు. ఒక్కో జోనర్ ప్రేక్షకుల కోసం విభిన్న కథలు ఎంచుకొని అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
తాజాగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా.. 'సోలో బ్రతుకే సో బెటర్' అని పురుషులందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. సినిమా చిత్రీకరణ ఇదే రోజున ప్రారంభించాడు. అంతేకాకుండా వచ్చే ఏడాది మే 1వ తేదీన సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.