'మహానటి'(Mahanati) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు యువ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). ఆయన ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో త్రిభాషా చిత్రం చేస్తున్నారు. లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ కనిపించనున్నారు. ఇందులో సీనియర్ కథానాయకుడు సుమంత్(Sumanth) ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ను తీర్చిదిద్దారు. అందులో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు.
దుల్కర్ సల్మాన్ చిత్రంలో టాలీవుడ్ హీరో - దుల్కర్ సల్మాన్ హను రాఘవపూడి
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) కథానాయకుడిగా హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఓ టాలీవుడ్ హీరో ప్రధానపాత్ర పోషించనున్నారు. ఆయనకు సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నారు.
ఈ ఏడాది దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీలుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. ఆ వీడియోతో కథానాయకుడి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrasekhar) స్వరాలు సమకూరుస్తున్నారు. స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తోంది. టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. నాయికతో పాటు నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి..ధర్మం తప్పినప్పుడే యుద్ధం!