మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 'ఆచార్య' షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా, చిరుకు వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించి, ట్వీట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ - chiranjeevi corona news
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవికి కరోనా సోకింది. అయితే లక్షణాలు ఏం లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్
"ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను" అని చిరు ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 9, 2020, 11:08 AM IST